AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : పాండ్యా కోసం కొట్టుకుంటున్న ఏడు ఫ్రాంచైజీలు.. ఆ రెండు జట్లు మాత్రం మాకొద్దంటున్నాయి

Hardik Pandya : హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే ట్రేడ్ రూమర్స్ ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎస్‌కే, కేకేఆర్ సహా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతుండగా, బెంగళూరుకు షిఫ్ట్ అయిన హార్దిక్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు.

Hardik Pandya : పాండ్యా కోసం కొట్టుకుంటున్న ఏడు ఫ్రాంచైజీలు.. ఆ రెండు జట్లు మాత్రం మాకొద్దంటున్నాయి
Hardik Pandya
Rakesh
|

Updated on: Jul 02, 2026 | 8:32 AM

Share

Hardik Pandya : భారత స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో సరికొత్త చర్చ నడుస్తోంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కంటే ముందు జరగబోయే ట్రేడ్ విండోలో ఆయన ముంబై ఇండియన్స్ జట్టును వీడే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ హార్దిక్ గనుక ముంబై టీమ్‌ను వదిలిపెడితే, అతన్ని తమ జట్టులోకి లాగేందుకు ఐపీఎల్‌లోని ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నాయి. ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. హార్దిక్‌ను సొంతం చేసుకునే రేసులో మహేంద్ర సింగ్ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అందరికంటే ముందుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

ఆ రెండు జట్లు మాత్రం నో చెప్పేశాయి

హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకోవడానికి మెజారిటీ జట్లు ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు మాత్రం అతనిపై ఎలాంటి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. హార్దిక్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2015లో ముంబై ఇండియన్స్‌తోనే ప్రారంభించాడు. ఆ తర్వాత 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా మారి మొదటి సీజన్ లోనే కప్ అందించి, రెండో సీజన్ లో రన్నరప్‌గా నిలబెట్టాడు. అయితే, గతేడాది భారీ హైప్ మధ్య తిరిగి ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆయన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆయన నాయకత్వంలో ముంబై జట్టు గత మూడు సీజన్లలో వరుసగా 10వ స్థానం, 3వ స్థానం, 9వ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ముంబైని వదిలి బెంగళూరుకు షిఫ్ట్ అయిన హార్దిక్

ఐపీఎల్ ట్రేడింగ్ రూమర్స్ ఇలా ఉంటే.. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచాడు. ఆయన ముంబై నగరాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి, బెంగళూరుకు తన బసను మార్చేశాడు. బెంగళూరు నగర శివార్లలో ఉన్న బీసీసీఐ కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)కు అత్యంత సమీపంలో ఒక విలాసవంతమైన ఇల్లును కూడా ఆయన అద్దెకు తీసుకున్నాడు. ఇకపై తన కెరీర్ ముగిసే వరకు బెంగళూరులోనే ఉంటూ, అక్కడి అత్యాధునిక సౌకర్యాల నడుమ తన ఫిట్‌నెస్, ట్రైనింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని హార్దిక్ భావిస్తున్నాడు. ఈ విధంగా బీసీసీఐ అకాడమీని తన పర్మనెంట్ ట్రైనింగ్ బేస్‌గా మార్చుకున్న మొదటి భారతీయ క్రికెటర్‌గా హార్దిక్ రికార్డు సృష్టించాడు.

గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరం

ప్రస్తుతం హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ ఇంజూరీ కారణంగానే ఆయన ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వైట్-బాల్ (టీ20, వన్డే) సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు. బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “హార్దిక్ ఇప్పటికే బెంగళూరుకు పూర్తిగా షిఫ్ట్ అయిపోయాడు. తన కెరీర్‌ను సుదీర్ఘ కాలం పాటు కొనసాగించడానికి, ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్ సాధించడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అతనికి ఎంతగానో ఉపయోగపడుతుంది” అని స్పష్టం చేశారు. ఏదేమైనా అటు గాయం నుంచి కోలుకోవడం, ఇటు ఐపీఎల్‌లో టీమ్ మారే అవకాశాలు ఉండటంతో రాబోయే రోజుల్లో హార్దిక్ పాండ్యా చుట్టూనే ఇండియన్ క్రికెట్ పాలిటిక్స్ తిరగనున్నాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి