Video: ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఏకంగా రెండోసారి బాదేసిన కేకేఆర్ ప్లేయర్.. ఎక్కడో తెలుసా?
Ramandeep Singh Hit 5 Sixes In An Over: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్న రమణ దీప్ సింగ్ (Ramandeep Singh) ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదడం ఇదే తొలిసారి కాదు. గతేడాది జరిగిన షేర్-ఏ-పంజాబ్ టీ20 కప్‌లో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. తాజాగా మరోసారి 5 సిక్సర్లు కొట్టాడు.
Ramandeep Singh Hit 5 Sixes In An Over: పంజాబ్ వేదికగా జరుగుతున్న షేర్ ఇ పంజాబ్ టీ20 కప్ టోర్నీ 20వ మ్యాచ్‌లో రమణ దీప్ సింగ్ ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదాడు. ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రైడెంట్ స్టాలియన్స్, జేకే సూపర్ స్ట్రైకర్స్ తలపడ్డాయి.
వర్షం ప్రభావంతో ఈ మ్యాచ్‌లో ట్రైడెంట్ స్టాలియన్స్ జట్టు కెప్టెన్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 13 ఓవర్లకే పరిమితమైన ఈ మ్యాచ్‌లో.. ఇన్నింగ్స్ ప్రారంభించిన ట్రైడెంట్ స్టాలియన్స్‌కు శుభారంభం లభించలేదు.
ఓపెనర్లు మన్‌ప్రీత్ జోహల్ (4), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (13) తొందరగానే నిష్క్రమించగా, అభయ్ చౌదరి 33 బంతుల్లో 23 పరుగులు చేశాడు.
6వ ర్యాంక్‌లో బరిలోకి దిగిన రమణ దీప్ సింగ్ ఆరంభంలో జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. కానీ, మ్యాచ్ 13వ ఓవర్లో విశ్వరూపం చూపించాడు.
సాహిల్ ఖాన్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి రమణ దీప్ సింగ్ పరుగులేమీ చేయలేదు. అయితే, ఆ తర్వాత 3 హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. దీని తర్వాత సాహిల్ ఖాన్ రెండు వైడ్లు వేశాడు. 5వ బంతికి మరో సిక్స్ బాదాడు. ఆ తర్వాత మరో రెండు సెక్సులు బాదేశాు. చివరి బంతికి రమణ దీప్ సింగ్ భారీ సిక్సర్ కొట్టి 34 పరుగులు చేశాడు.
రమణ దీప్ సింగ్ (46) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ట్రైడెంట్ స్టాలియన్స్ జట్టు 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.
డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 114 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జేకే సూపర్ స్ట్రైకర్స్‌కు ఓపెనర్ కార్తీక్ శర్మ (58) హాఫ్ సెంచరీతో విజృంభించాడు. కెప్టెన్ సన్వీర్ సింగ్ 12.5 ఓవర్లలో 20 పరుగులు చేయడంతో జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రెండోసారి ఒకే ఓవర్లో 5 సిక్సర్లు..
— IndiaCricket (@IndiaCrick18158) July 20, 2023
రమణ దీప్ సింగ్ ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదడం ఇదే తొలిసారి కాదు. గతేడాది జరిగిన షేర్-ఏ-పంజాబ్ టీ20 కప్‌లో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. అగ్రి కింగ్ నైట్స్ తరపున ఆడిన రమణ దీప్ సింగ్ ఆఫ్ స్పిన్నర్ క్రిషన్ అలంగ్ వేసిన 13వ ఓవర్ 5 బంతుల్లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు రమణ దీప్ సింగ్ మరోసారి 5 సిక్సర్లతో చెలరేగిపోయాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..