AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2025: 3 ఏళ్ల తర్వాత ‘సచిన్‌’ను కరుణించిన కావ్యా మారన్.. బేస్ ప్రైజ్‌కే పట్టేసిందిగా

Sachin Baby Sunrisers Hyderabad Ipl: ఇతర క్రీడల్లాగే, క్రికెట్‌లో ప్రతిభ ఒక్కటే సరిపోదు. పురోగతి సాధించడానికి అదృష్టం కూడా అవసరం. సచిన్ బేబీ జాతీయ జట్టులో ఎందుకు లేరని అడిగితే.. అది కేవలం ‘దురదృష్టకరం’ అనే ఒక్క మాటలో సమాధానం చెప్పొచ్చు.

IPL Auction 2025: 3 ఏళ్ల తర్వాత 'సచిన్‌'ను కరుణించిన కావ్యా మారన్.. బేస్ ప్రైజ్‌కే పట్టేసిందిగా
Sachin Baby Sunrisers Hyder
Venkata Chari
|

Updated on: Nov 26, 2024 | 12:32 PM

Share

ఐపీఎల్ స్టార్ వేలంలో 12 మంది కేరళ ఆటగాళ్లు పాల్గొనగా.. కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే జట్లు కొనుగోలు చేశాయి. విష్ణు వినోద్ (పంజాబ్ కింగ్స్), సచిన్ బేబీ (సన్‌రైజర్స్ హైదరాబాద్), విఘ్నేష్ పుత్తూర్ (ముంబై ఇండియన్స్)లను మెగా వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. రోహన్ ఎస్. కున్‌మల్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌లు ఐపీఎల్‌లో ఆడాలని భావించినప్పటికీ వేలంలో మొండిచేయి చూపించాయి ఫ్రాంచైజీలు.

మూడేళ్ల తర్వాత సచిన్ మళ్లీ ఐపీఎల్‌లోకి వస్తున్నాడు. సచిన్ బేబీ మొదట రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్‌కు తీసుకువచ్చింది. అది కూడా 2013లో కావడం గమనార్హం. కానీ చాలా మ్యాచ్ లలో గ్యాలరీలో కూర్చుని ఆటను వీక్షించాల్సి వచ్చింది. 2016లో బెంగళూరుకు రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడిన సచిన్ బేబీ 11 మ్యాచ్‌ల్లో 119 పరుగులు చేశాడు. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సంతకం చేసింది. 2021లో తిరిగి RCBకి చేరాడు. మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సచిన్ సన్‌రైజర్స్ శిబిరానికి తిరిగి రానున్నాడు. రూ. 30 లక్షల బేస్ ప్రైజ్‌తోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు.

అబ్దుల్ బాసిత్, సల్మాన్ నిసార్‌లపైనా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. కేరళ క్రికెట్ లీగ్‌లో త్రిసూర్ టైటాన్స్ తరఫున సెంచరీ చేసిన విష్ణు వినోద్‌ను పంజాబ్ కింగ్స్ 95 లక్షలకు కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడిన విష్ణును ముంబై కొనుగోలు చేస్తుందని భావించినా అది జరగలేదు.

ఇవి కూడా చదవండి

తొలి కేరళ క్రికెట్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ‘ఏరీస్ కొల్లం సెయిలర్స్’కు సచిన్ బేబీ ‘కెప్టెన్’గా పనిచేశాడు. సచిన్ 528 పరుగులతో లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫైనల్లో కూడా ఈ స్టార్ ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో కేరళ తరపున ఈ ఆటగాడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అలాగే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా కేరళ తరపన ఈ ఆటగాడు మంచి ప్రదర్శన చేశాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో సచిన్ బేబీ చేరికతో లీగ్‌లో మలయాళీల ప్రాతినిధ్యం మూడుకు పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, పంజాబ్ కింగ్స్ స్టార్ విష్ణు వినోద్ ఇప్పటికే ఐపీఎల్‌కు చేరుకున్నారు. నిన్న జరిగిన స్టార్ వేలం సందర్భంగా విష్ణు పంజాబ్ చేరుకున్నాడు. 95 లక్షలకు ఈ ఆటగాడు పంజాబ్ జట్టులో చేరాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..