ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్‌కు అమ్ముడయ్యాడు. ఈ బిడ్డింగ్‌తో రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు వేలం వెళ్ళిన ఆటగాడిగా నిలిచాడు. 2022లో జరిగిన కారు ప్రమాదం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి రీఎంట్రీ ఇచ్చిన పంత్ తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుని, ఈ భారీ ధరకు ఎంపికయ్యాడు.
రిషబ్ పంత్ కోసం రూ.20.75 కోట్ల వరకు బిడ్డింగ్ జరిగినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ తమ RTM కార్డ్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించింది. అయితే లక్నో రూ.27 కోట్ల బిడ్డింగ్ పెట్టడంతో ఢిల్లీ వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో పంత్ లక్నో జట్టుకు వెళ్లి, 2025లో ఈ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం, లక్నో జట్టు రిషబ్ పంత్ కోసం పెట్టిన రూ.27 కోట్లు మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ మొత్తానికి సంబంధించినవి. అంటే, పంత్ ఈ కాలంలో ప్రతి ఏడాది సగటున రూ.9 కోట్లు పొందుతాడు. అయితే ఈ మొత్తం నుంచి భారత ప్రభుత్వం పన్ను కింద 30% కట్ చేస్తుంది, అంటే రిషబ్ క్లీన్‌గా తన చేతిలో రూ.18.9 కోట్లు మాత్రమే అందుకుంటాడు.
గాయాల విషయానికొస్తే, ఐపీఎల్ మ్యాచ్‌లలో గాయం జరిగినప్పుడు బీసీసీఐ బీమా పాలసీ ప్రకారం ఆటగాడి జీతాన్ని పూర్తిగా చెల్లిస్తారు. కానీ మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే గాయం కారణంగా అతను ఆడలేకపోతే, జట్టు అతని స్థానంలో మరొక ఆటగాడిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అదే విదేశీ ఆటగాళ్లకు వస్తే, కాంట్రాక్ట్ గడువుకు ముందే వైదొలిగితే వారికి చెల్లింపు ఉండదు.
వివిధ కారణాల వల్ల ఆటగాళ్లు సిరీస్‌ను మధ్యలో వదిలి వెళ్లినా, ఆటగాడు ఆడిన మ్యాచ్‌లను బట్టి మాత్రమే జీతం చెల్లించబడుతుంది. అయితే మ్యాచ్ సందర్భంగా గాయపడితే, జట్టు మొత్తం చెల్లింపు చేయవలసి ఉంటుంది. ఇది ఐపీఎల్‌లో ఆటగాళ్లకు అందుబాటులో ఉండే భద్రతా చట్టం