Video: 37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. ఐపీఎల్ హిస్టరీకే హార్ట్ ఎటాక్ తెప్పించిన మ్యాచ్.. వీడియో చూస్తారా?

T20 Highest Match Aggregate: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే రికార్డుల వేదిక. ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా సాగుతున్న తరుణంలో, క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక అద్భుత ఘట్టం గురించి చర్చ జరుగుతోంది. బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూ, 37 సిక్సర్లు, 43 ఫోర్లతో నమోదైన 549 పరుగుల సునామీ రికార్డును అధిగమించడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యంగా కనిపిస్తోంది.

Video: 37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. ఐపీఎల్ హిస్టరీకే హార్ట్ ఎటాక్ తెప్పించిన మ్యాచ్.. వీడియో చూస్తారా?
Ipl Records

Updated on: Apr 10, 2026 | 4:53 PM

IPL Records: ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ 2026లో ఎన్నో కొత్త రికార్డులు నమోదవుతున్నప్పటికీ, 2024 నాటి ఆ విధ్వంసకర మ్యాచ్‌ను ఎవరూ మర్చిపోలేరు. కొన్నిసార్లు తక్కువ స్కోర్లు నమోదై అభిమానులను నిరాశపరిచినా, ఈ లీగ్ అందించే అసలు సిసలు మజా అధిక స్కోరింగ్ మ్యాచ్‌లలోనే ఉంటుంది.

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు: ఫోర్లు, సిక్సర్ల విందు..

చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఆ పోరులో పరుగుల వరద పారింది. హైదరాబాద్ బ్యాటర్లు మునుపెన్నడూ లేని రీతిలో చెలరేగిపోవడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక జట్టు స్కోరు నమోదైంది. కేవలం ఒక ఇన్నింగ్స్‌తోనే ఆగిపోకుండా, ఆర్‌సీబీ బ్యాటర్లు కూడా ధీటుగా సమాధానం ఇవ్వడంతో మ్యాచ్ మొత్తం బౌండరీల మోతతో దద్దరిల్లిపోయింది.

హెడ్ సెంచరీ.. క్లాసెన్ మెరుపులు..

టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకోవడం వారి పాలిట శాపంగా మారింది. హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 41 బంతుల్లోనే 102 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ కేవలం 31 బంతుల్లో 67 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో మార్క్రమ్, అబ్దుల్ సమద్ కేవలం 10 బంతుల్లోనే 37 పరుగులు సాధించడంతో హైదరాబాద్ మొత్తం 287 పరుగుల భారీ స్కోరును సాధించింది.

పోరాడి ఓడిన ఆర్‌సీబీ.. కార్తీక్ సాహసం..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ శుభారంభం ఇచ్చారు. విరాట్ 42 పరుగులు చేయగా, కెప్టెన్ డు ప్లెసిస్ 62 పరుగులు సాధించాడు. అయితే మధ్యలో వికెట్లు పడినా, దినేష్ కార్తీక్ అసాధారణ పోరాటం చేశాడు. 35 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. ఆర్‌సీబీ ఓడిపోయినప్పటికీ, రెండు ఇన్నింగ్స్ కలిపి నమోదైన 549 పరుగులు ప్రపంచ క్రికెట్‌లోనే ఒక మరువలేని రికార్డుగా నిలిచిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us