IPL 2026: ఇద్దరు ఆసీస్ ప్లేయర్లకు IPL ఫ్రాంచైజీ రూ.58 కోట్ల భారీ ఆఫర్.. ఒక్కటే కండీషన్..!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి బోర్డులు తమ ఆటగాళ్లకు మంచి జీతాలు ఇస్తూ, వారికి జాతీయ క్రికెట్‌ పట్ల నిబద్ధత ఉండేలా చూసుకుంటున్నాయి. ఈ భారీ ఆఫర్ విషయం ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా (CA), బిగ్ బాష్ లీగ్ (BBL) ప్రైవేటీకరణపై జరుగుతున్న చర్చలకు మరింత బలాన్ని చేకూర్చింది.

IPL 2026: ఇద్దరు ఆసీస్ ప్లేయర్లకు IPL ఫ్రాంచైజీ రూ.58 కోట్ల భారీ ఆఫర్.. ఒక్కటే కండీషన్..!
Australia Players

Updated on: Oct 08, 2025 | 1:56 PM

IPL Franchise: క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం మానేసి, ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లలో ఏడాది పొడవునా ఆడటం కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్, స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌లకు ఒక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ ఏకంగా రూ. 58 కోట్లు (సుమారు $10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు) చొప్పున భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఆ ఆఫర్ షరతు ఏంటంటే?

ఐపీఎల్‌కు చెందిన ఈ ఫ్రాంచైజీ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో (SA20, ILT20, MLC వంటివి) జట్లను కలిగి ఉంది. కమ్మిన్స్, హెడ్‌లు తమ జాతీయ జట్టు (ఆస్ట్రేలియా) తరపున ఆడటం మానేసి, ఏడాది పొడవునా తమ ఫ్రాంచైజీ వ్యవస్థలో భాగస్వామ్యం కావాలని ఆ ఆఫర్‌లో షరతు విధించినట్లు సమాచారం. ఈ షరతుకు ఒప్పుకుంటే, వారికి ప్రతి సంవత్సరం రూ. 58 కోట్ల చొప్పున జీతం దక్కుతుంది.

దేశానికే మొదటి ప్రాధాన్యత: ఆఫర్ తిరస్కరణ..

అయితే, ఇంత భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపినా, కమ్మిన్స్, హెడ్ ఇద్దరూ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడాలనే తమ నిబద్ధతను, ఆ ‘బాగీ గ్రీన్’ (ఆస్ట్రేలియా టెస్ట్ క్యాప్) పట్ల ఉన్న గౌరవాన్ని వీరు వదులుకోవడానికి ఇష్టపడలేదు.

ఇవి కూడా చదవండి

ట్రావిస్ హెడ్ మాటల్లో..

“ప్రస్తుతం నేను ఆస్ట్రేలియా కోసమే ఆడుతున్నాను. అంతకంటే వేరే దేనికీ నేను ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు. ఐపీఎల్ కొంత సమయాన్ని తీసుకుంటుంది. కానీ, ఆస్ట్రేలియాకు నేను ఎంత వీలైతే అంత కమిట్‌మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం వారి ఆదాయం ఎంత?

ఈ భారీ ఆఫర్ విలువ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే, వారు ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ద్వారా, ఐపీఎల్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారో వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఈ లెక్కన, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇచ్చిన రూ. 58 కోట్ల ఆఫర్ వారి ప్రస్తుత వార్షిక ఆదాయాన్ని (ముఖ్యంగా ట్రావిస్ హెడ్ విషయంలో) గణనీయంగా పెంచేది. అయినప్పటికీ, దేశం కోసం ఆడటానికే వారు ఎక్కువ విలువ ఇచ్చారు.

టీ20 లీగ్‌ల ప్రభావం..

పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్‌లకు వచ్చిన ఈ క్రేజీ ఆఫర్.. ప్రపంచ క్రికెట్‌లో ఫ్రాంచైజీ లీగ్‌ల పెరుగుతున్న ప్రభావాన్ని, జాతీయ జట్లకు ఉన్న ముప్పును మరోసారి స్పష్టం చేస్తోంది. ఇప్పటికే సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ వంటి కొందరు క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి, పూర్తిగా టీ20 లీగ్‌లలో ఆడుతున్నారు.

అయితే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి బోర్డులు తమ ఆటగాళ్లకు మంచి జీతాలు ఇస్తూ, వారికి జాతీయ క్రికెట్‌ పట్ల నిబద్ధత ఉండేలా చూసుకుంటున్నాయి. ఈ భారీ ఆఫర్ విషయం ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా (CA), బిగ్ బాష్ లీగ్ (BBL) ప్రైవేటీకరణపై జరుగుతున్న చర్చలకు మరింత బలాన్ని చేకూర్చింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..