AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దు.. RCB vs LSG మ్యాచ్‌పై వీడిన ఉత్కంఠ.. ఐపీఎల్ 2025లో లాస్ట్ మ్యాచ్ ఇదే?

IPL 2025: ఐపీఎల్ 2025లో మే 10 శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌పై సందిగ్ధం నెలకొంది. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ఓ కీలక ప్రకటన ఇచ్చారు. ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దు.. RCB vs LSG మ్యాచ్‌పై వీడిన ఉత్కంఠ.. ఐపీఎల్ 2025లో లాస్ట్ మ్యాచ్ ఇదే?
Lsg Vs Rcb Match
Venkata Chari
|

Updated on: May 09, 2025 | 7:35 AM

Share

RCB vs LSG: ఐపీఎల్ 2025 (IPL 2025)లో ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ 11వ ఓవర్ జరుగుతుండగా, ధర్మశాల స్టేడియం లైట్లు ఆపివేశారు. సాంకేతిక లోపం కారణంగా మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ తెలియజేసింది. అయితే, దీనికి ప్రధాన కారణం భారతదేశంపై పాకిస్తాన్ రాకెట్, డ్రోన్ దాడులు చేస్తోంది. అయితే, వీటిని భారత్ కూడా తిప్పి కొట్టింది. ఇలాంటి సరిస్థితుల్లో మ్యాచ్ జరగడం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. అందుకే మ్యాచ్‌ను రద్దు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే రాబోయే ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా రద్దు అవుతాయా? శుక్రవారం లక్నోలో జరగనున్న RCB, LSG మ్యాచ్ జరుగుతుందా? దీనిపై ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమల్ కీలక సమాచారం ఇచ్చారు.

RCB వర్సెస్ LSG మధ్య మ్యాచ్ ఉంటుందా?

పాకిస్తాన్‌తో సైనిక ప్రతిష్టంభన దృష్ట్యా ఐపీఎల్ కొనసాగుతుందా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వ సూచనల కోసం ఎదురుచూస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ గురువారం తెలిపారు. అయితే, శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని ధుమల్ అన్నారు.

ఐపీఎల్ చైర్మన్ ఏం చెప్పారు?

పీటీఐతో మాట్లాడుతూ అరుణ్ ధుమాల్, ‘ప్రస్తుత పరిస్థితిని మేం సమీక్షిస్తున్నాం. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సూచనలు రాలేదు. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి, శుక్రవారం మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. కానీ, పరిస్థితి నిరంతరం మారుతూ ఉండొచ్చు. కాబట్టి అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునేలా మా నిర్ణయం ఉంటుంది” అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ధర్మశాల నుంచి ఆటగాళ్ళు ఢిల్లీకి చేరేదిలా..

పంజాబ్ వర్సెస్ ఢిల్లీ ఆటగాళ్ల గురించి చెప్పాలంటే, వారిని ధర్మశాల నుంచి బయటకు తీసుకెళ్లడానికి ఒక ప్రణాళిక రూపొందించారు. నివేదికల ప్రకారం, రెండు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని ధర్మశాల నుంచి 85 కి.మీ దూరంలో ఉన్న పఠాన్‌కోట్ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి తీసుకెళ్తారని తెలుస్తోంది. ఈ బృందాలు రోడ్డు మార్గంలో పఠాన్‌కోట్ చేరుకుంటాయి. అయితే, ఈ రైలు ఉనా నుంచి కూడా నడపవచ్చని నివేదికలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్వయంగా తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ దాడులు జరగకుండా నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రా, చండీగఢ్ విమానాశ్రయాలను కూడా మూసివేశారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..