AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పేరు వింటేనే పాకిస్తాన్ గజగజ వణికిపోవాలి.. నీరజ్ చోప్రా నుంచి సెహ్వాగ్ వరకు ఎవరేం ట్వీట్ చేశారంటే?

India Pakistan Border Tension: భారత వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో భారతదేశంలోని అనేక నగరాల్లో డ్రోన్ దాడులు చేయడానికి ప్రయత్నించి, విఫలమైంది. ఆ తరువాత భారత క్రీడా ప్రపంచం సైన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

ఆ పేరు వింటేనే పాకిస్తాన్ గజగజ వణికిపోవాలి.. నీరజ్ చోప్రా నుంచి సెహ్వాగ్ వరకు ఎవరేం ట్వీట్ చేశారంటే?
India Pakistan Border Tensi
Venkata Chari
|

Updated on: May 09, 2025 | 8:02 AM

Share

India Pakistan Border Tension: పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 22న జరిగిన ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత భారతదేశం పాకిస్తాన్, పిఓకెలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. దానికి ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ, ఆ తరువాత కూడా పాకిస్తాన్ ఆగలేదు. క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. అయితే, భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తానీ క్షిపణులను గాల్లోనే కూల్చివేసింది. ఆ తర్వాత భారత సైన్యాన్ని క్రీడా ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పడానికి అందరూ కలిసి రావాలని కోరారు.

అభిమానులకు నీరజ్ చోప్రా ప్రత్యేక విజ్ఞప్తి..

పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న తర్వాత పాకిస్తాన్ భయాందోళనలో ఉంది. భారతదేశంలోని అనేక నగరాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. దీనిలో ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్‌కోట్, కథువా, రాజస్థాన్, పంజాబ్ వంటి ముఖ్యమైన నగరాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే, భారతదేశం అన్ని క్షిపణులను, డ్రోన్లను కూల్చివేసింది. ఆ తర్వాత భారత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన దేశం కోసం పోరాడుతున్న ధైర్యవంతులైన భారత సాయుధ దళాలను చూసి మేం గర్విస్తున్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి మన వంతు కృషి చేద్దాం, మార్గదర్శకాలను పాటిద్దాం. జై హింద్, జై భారత్, జై హింద్ సైన్యం’ అంటూ ట్వీట్ చేశాడు.

మరోవైపు, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ‘పాకిస్తాన్ మౌనంగా ఉండే అవకాశం వచ్చినప్పుడు యుద్ధ మార్గాన్ని ఎంచుకుంది. తన ఉగ్రవాద ఆస్తులను కాపాడుకోవడానికి ఇలా చేశారనే వాస్తవం వెలుగులోకి వస్తోంది. మన దళాలు అత్యంత సముచితమైన రీతిలో స్పందిస్తాయి, పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఆన్సర్ ఇచ్చాయి’ అంటూ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

మన వీర సైనికులకు సెల్యూట్..

టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ కూడా భారత సైనికులను ప్రశంసించాడు. ‘మన సరిహద్దులను ఇంత బలంగా రక్షించినందుకు, జమ్మూపై డ్రోన్ దాడులను నిరోధించినందుకు మన సైనికులకు సెల్యూట్’ అని ఆయన ట్వీట్ చేశాడు. మరోవైపు, మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్, ‘పాకిస్తాన్ ఒక దుష్ట దేశం. భారతదేశం ఇలాగే గుణపాఠం నేర్పగలదు’ అంటూ ట్వీట్ చేయగా.. హర్భజన్ సింగ్ ‘జై భారత్’ అంటూ రాసుకొచ్చాడు.

ఈ దాడుల తర్వాత, రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిందని, ఇది క్రీడను కూడా ప్రభావితం చేసింది. బుధవారం పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రజలు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, రాబోయే ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా తిరిగి షెడ్యూల్ చేయవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..