IPL 2023: ముంబైతో లెక్క సరిచేస్తారా..? దూకుడు చూపిస్తామంటున్న గుజరాత్ టైటాన్స్.. తుది జట్టు వివరాలివే..

IPL 2023, GT vs MI: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా నేడు జరగబోయే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ సారథి..

IPL 2023: ముంబైతో లెక్క సరిచేస్తారా..? దూకుడు చూపిస్తామంటున్న గుజరాత్ టైటాన్స్.. తుది జట్టు వివరాలివే..
Ipl 2023; Gt Vs Mi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 25, 2023 | 11:50 AM

IPL 2023, GT vs MI: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా నేడు జరగబోయే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ సారథి హార్ధిక్ పాండ్యా తన మాజీ ఐపీఎల్ టీమ్‌తో తలపడనున్నాడు. అలాగే ఈ మ్యాచ్ టీమిండియా టీ20 సారధి(రోహిత్ శర్మ), అతని వారసుడి(హార్దిక్ పాండ్యా)కి మధ్య జరగనుండడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. దీంతోపాటు ఈ మ్యాచ్‌పై ఫ్యాన్స్ ఊహాగానాలు తెగ వినిపిస్తున్నాయి.

మరోవైపు ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఆడిన 6 మ్యాచ్‌లలో 3 మాత్రమే గెలవగా.. గుజరాత్ మాత్రం ఆరింటికి 4 విజయాలు సాధించి దూకుడుగా ఉంది. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో ఎలా అయినా గుజరాత్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇక ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకు కేవలం ఒక్కసారే తలపడగా.. అందులో ముంబై విజయం సాధించింది. ఈ క్రమంలో ముంబైతో తమ లెక్క సరిచేయాలని హర్ధిక్ పాండ్యా కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు.

తుది జట్టు వివరాలు(అంచనా)..

గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, రిలే మెరెడిత్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!