IPL 2026: వాడు ఆడుతోన్న తీరు చూస్తుంటే వణుకొస్తోంది.. గేల్ కంటే 100 రెట్లు డేంజరస్

Vaibhav Suryavanshi IPL 2026: ఎల్ 2026 ప్రారంభానికి ముందు 14 ఏళ్ల బీహార్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగుతున్న ఈ టీనేజ్ సెన్సేషన్ గురించి మాజీ కెప్టెన్ సంజు శాంసన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాహుల్ ద్రావిడ్‌తో వైభవ్ అన్న మాటలు వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే! ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం.

IPL 2026: వాడు ఆడుతోన్న తీరు చూస్తుంటే వణుకొస్తోంది.. గేల్ కంటే 100 రెట్లు డేంజరస్
Vaibhav Suryavanshi Ipl 2026

Updated on: Mar 20, 2026 | 11:42 AM

Vaibhav Suryavanshi IPL 2026: ఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈసారి అందరి దృష్టి బీహార్‌కు చెందిన 14 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ఉంది. 2025 సీజన్‌లోనే అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు, తన మొదటి సీజన్‌లోనే 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ, చిన్న వయసులోనే దిగ్గజ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

సంజు శాంసన్ ఆసక్తికర కామెంట్స్..

ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ గురించి ఒక అద్భుతమైన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ అరంగేట్రానికి ముందు టీమ్ ఇండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్, వైభవ్‌ను పిలిచి తన గేమ్ ప్లాన్ ఏంటని అడిగారు. దానికి ఏమాత్రం తడబడకుండా, “సార్, ప్రత్యేక ప్లాన్ ఏమీ లేదు.. మొదటి బంతి నా జోన్‌లోకి వస్తే గాలిలోకి పంపించేస్తా” అని బదులిచ్చాడట. చెప్పినట్లుగానే మైదానంలో చెలరేగి ఆడుతున్న వైభవ్ ఆట తీరు ఒక ‘వీడియో గేమ్’లా ఉంటుందని సంజు ప్రశంసించాడు.

క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన కుర్రాడు..

ప్రఖ్యాత వ్యాఖ్యాత హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు వైభవ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఐపీఎల్‌లో ఏ రికార్డును బద్దలు కొట్టాలని ఉంది అని అడగగా, క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల రికార్డును అధిగమించడమే తన లక్ష్యమని ధీమాగా చెప్పాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 175 పరుగులు చేసిన అనుభవం ఉండటంతో, ఐపీఎల్‌లో కూడా ఆ ఘనత సాధిస్తానని నమ్ముతున్నాడు.

సమీకరణాల్లో మార్పులు..

గత సీజన్‌లో సంజు శాంసన్ సారధ్యంలో ఆడిన వైభవ్, ఈసారి రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడబోతున్నాడు. కాగా, సంజు శాంసన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడం ఐపీఎల్ 2026లో ఒక పెద్ద మార్పుగా నిలిచింది. ఈ సీజన్ వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా ఎంట్రీకి ఒక బలమైన పునాది కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us