AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ముదురుతున్న వివాదం.. లక్నో కెప్టెన్‌గా పంత్‌కు ఉద్వాసన?.. నెక్ట్స్ కెప్టెన్ ఎవరంటే ?

IPL 2026 : ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ వైఫల్యాల నేపథ్యంలో రిషబ్ పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. మార్క్రామ్‌కు బాధ్యతలు ఇవ్వాలని సూచనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్‌లో కూడా 9 మ్యాచ్‌ల్లో 204 పరుగులకే పరిమితమయ్యాడు.

IPL 2026 :  ముదురుతున్న వివాదం.. లక్నో కెప్టెన్‌గా పంత్‌కు ఉద్వాసన?.. నెక్ట్స్ కెప్టెన్ ఎవరంటే ?
Rishabh Pant
Rakesh
|

Updated on: May 05, 2026 | 10:36 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు అస్సలు కలిసిరావడం లేదు. వరుస ఓటములతో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు దాదాపు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, అతడిని స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయనివ్వాలని మాజీ ఆటగాళ్లు మనోజ్ తివారీ, రోహన్ గవాస్కర్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘోర పరాజయం పాలైన తర్వాత ఈ చర్చ మరింత ముదిరింది. గత ఏడాది భారీ ధర పెట్టి పంత్‌ను కొనుగోలు చేసిన లక్నో యాజమాన్యం, అతడే తమ జట్టు భవిష్యత్తు అని భావించింది. కానీ, గతేడాది 14 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేసిన పంత్, ఈ సీజన్‌లో కూడా 9 మ్యాచ్‌ల్లో 204 పరుగులకే పరిమితమయ్యాడు. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ (128.30) చాలా ఆందోళనకరంగా మారింది. కెప్టెన్సీ ఒత్తిడి వల్లే పంత్ తన సహజసిద్ధమైన విధ్వంసకర బ్యాటింగ్‌ను కోల్పోతున్నాడని రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

“పంత్ ఒక గొప్ప టాలెంట్ ఉన్న ఆటగాడు. కానీ కెప్టెన్సీ భారం అతడిని విఫలం చేస్తోంది. జట్టు ఓడిపోతున్నప్పుడు ఆ ఒత్తిడి నాయకుడిపై పడుతుంది. అందుకే అతడిని ఆ బాధ్యత నుంచి తప్పించి కేవలం బ్యాటర్‌గా ఆడించాలి” అని రోహన్ గవాస్కర్ పేర్కొన్నారు. మనోజ్ తివారీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. పంత్ లాంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాడిని మనం కోల్పోకూడదని, అతడికి స్వేచ్ఛనివ్వడం జట్టుకు, అతడికి కూడా మంచిదని హితవు పలికారు.

ఒకవేళ పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడెన్ మార్క్‎రమ్ సిద్ధంగా ఉన్నాడు. మార్క్‎రమ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా రెండుసార్లు ఎస్ఏ20 టైటిల్స్ గెలుచుకుంది. అతను చాలా ప్రశాంతంగా ఉంటూ జట్టును నడిపించగల సమర్థుడని వసీం జాఫర్ వంటి మాజీలు సూచిస్తున్నారు. మార్క్‎రమ్ టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణించడమే కాకుండా, వ్యూహాలను అమలు చేయడంలో కూడా దిట్ట అని వారు గుర్తు చేస్తున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాకు పంత్ అంటే చాలా ఇష్టం. పంత్ ఈ జట్టులో మరో 10-15 ఏళ్ల పాటు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. కానీ ప్రస్తుత ఫలితాలు, ఆటగాడి వ్యక్తిగత ఫామ్ దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. లక్నో జట్టును మళ్లీ గాడిలో పెట్టాలంటే నాయకత్వ మార్పు అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వచ్చే సీజన్‌లో లేదా ఈ సీజన్ చివరిలో పంత్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడా లేక తన ఆటతో విమర్శలకు సమాధానం చెబుతాడా అనేది వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us