IPL 2025: అవేశ్ ఖాన్ అద్భుతం.. లక్నో విజయంతో ఎగిరి గంతేసిన సంజీవ్ గోయెంకా.. వీడియో ఇదిగో

ఈ ఐపీఎల్ సీజన్ లో క్రికెటర్లతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా పేరు కూడా తరచూ వార్తల్లో వినిపిస్తోంది. అందుకు కారణం ఆయన వింత ప్రవర్తనే. ఆటగాళ్లతో సంజీవ్ గోయెంకా మాట్లాడే తీరు, ప్రవర్తనా విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

IPL 2025: అవేశ్ ఖాన్ అద్భుతం.. లక్నో విజయంతో ఎగిరి గంతేసిన సంజీవ్ గోయెంకా.. వీడియో ఇదిగో
IPL 2025

Updated on: Apr 20, 2025 | 11:13 AM

ఐపీఎల్ 36వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది . జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్లో RR కి 9 పరుగులు మాత్రమే అవసరం కాగా అవేష్ ఖాన్ అద్భుతం చేశాడు. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి లక్నో సూపర్ జెయింట్స్ కు 2 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందించాడు. . ఈ విజయంతో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కుర్చీలో నుంచి లేచి గంతులేశారు. పక్కనుండే వారితో చేతులు కలుపుతూ తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. కాగా గత సీజన్ల లాగానే ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా జట్టు వెంటే ఉంటూ ప్రోత్సహిస్తున్న సంజీవ్ తరుచూ తన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

అంతకు ముందు లక్నో బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ లో భాగంగా కెప్టెన్ పంత్ తక్కువ స్కోరుకు ఔటైనప్పుడు కూడా ఇలాగే వింతగా ప్రవర్తించారు సంజీవ్ గోయెంకా. రాజస్థాన్ ఆటగాడు వానిందు హసరంగా వేసిన 8వ ఓవర్‌ను నాల్గవ బంతికి రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ అతని బ్యాట్ టాప్ ఎడ్జ్‌కి తగిలింది. దీంతో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో పంత్ నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. ఇదే క్రమంలో స్టాండ్స్ లో కూర్చున్న లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా వింతగా ప్రవర్తించారు. నోటిపై వేలు వేసుకుని, ఎవరికో సంకేతాలిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో, ఐడెన్ మార్క్రమ్, ఆయుష్ బడోనీల మెరుపు ఇన్నింగ్సులతో నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. ప్రతిగా, రాజస్థాన్ 178 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమిపాలైంది.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.