
ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాటర్ మిచెల్ ఓవెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో విశేషముంది అనుకుంటున్నారా? మిచెల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025) కు ప్రాతినిథ్యం వహించాడు. బాబార్ అజామ్ కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న పెషావర్ జల్మి జట్టులో సభ్యుడిగా కనిపించాడు. శుక్రవారం పెషావర్ జల్మీ తరపున మ్యాచ్ ఆడిన మిచెల్ ఓవెన్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎంపికయ్యాడు. పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయ్యాడు. దీంతో ఇప్పుడు, పంజాబ్ కింగ్స్ మ్యాక్సీ స్థానంలో మిచెల్ ఓవెన్‌ను ఎంపిక చేసుకుంది. దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో మిచెల్ ఓవెన్ సిద్ధ హస్తుడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు మిచెల్ ఓవెన్ పేరిటే ఉంది. ఇక చివరిసారి BBALలో మిచెల్ ఓవెన్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.
ఇవే కాదు BBL ఫైనల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా మిచెల్ ఓవెన్ పేరు మీద ఉంది. సిడ్నీ థండర్‌తో జరిగిన ఫైనల్‌లో మిచెల్ ఓవెన్ 11 సిక్సర్లు కొట్టడం ద్వారా హోబర్ట్ హరికేన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. అంతేకాకుండా, బిగ్ బాష్ లీగ్ చరిత్రలో 40 బంతుల్లోపు సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా మిచెల్ ఓవెన్ చరిత్ర సృష్టిచాడు. 23 ఏళ్ల మిచెల్ 39 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డును సాధించాడు. బీబీఎల్ ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ రికార్డు కూడా మిచెల్ ఓవెన్ పేరిట ఉంది. సిడ్నీ థండర్‌తో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో మిచెల్ కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు, బిగ్ బాష్ లీగ్‌లో రికార్డుల మీద రికార్డులు రాసిన యువ బ్యాటర్ ను పంజాబ్ కింగ్స్ జట్టు గ్లెన్ మాక్స్‌వెల్ స్థానంలో ఎంపిక చేసింది.
UPDATE: Mitchell Owen replaces Glenn Maxwell for the rest of #TATAIPL 2025 season. pic.twitter.com/yX7Z8uamMt
— Punjab Kings (@PunjabKingsIPL) May 4, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..