IPL 2025 Mega Auction: 2024 టైటిల్ విన్నర్, అయినా ఫ్రాంచైజ్ రెటైన్ చేసుకోలేదు కట్ చేస్తే IPL లో అత్యధిక ధరను బద్దలు కొట్టాడు

|

Nov 24, 2024 | 4:48 PM

ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడి అతని ధరను రూ. 26 కోట్ల వరకు తీసుకెళ్లారు. చివరగా పంజాబ్ సూపర్ కింగ్స్ శ్రేయస్ అయ్యార్ ని 26 కోట్లకు దక్కించుకుంది.

IPL 2025 Mega Auction: 2024 టైటిల్ విన్నర్, అయినా ఫ్రాంచైజ్ రెటైన్ చేసుకోలేదు కట్ చేస్తే IPL లో అత్యధిక ధరను బద్దలు కొట్టాడు
Shreyas Iyer Ipl 2025 Auction
Follow us on

ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడి అతని ధరను రూ. 26.75 కోట్ల వరకు తీసుకెళ్లారు. చివరగా పంజాబ్ సూపర్ కింగ్స్ శ్రేయస్ అయ్యార్ ని ₹26.75 కోట్లకు దక్కించుకుంది.

జెడ్డాలో జరిగిన ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ ల మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను మూడవ ఐపీఎల్ టైటిల్‌కు నడిపించిన అయ్యర్, ఈ సీజన్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో అంచనాలను మించి రాణించాడు.

అయ్యర్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు కాగా, పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకునేందుకు చివరి వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడి విజయం సాధించింది. అయ్యర్‌ను ఫ్రాంచైజీ విడుదల చేయడంపై కోల్‌కతా నైట్ రైడర్స్ CEO వెంకీ మైసూర్ స్పందిస్తూ, పరస్పర అంగీకారంతోనే ఆటగాళ్ల నిలుపుదల జరుగుతుందని, అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా ఈ సారి అది సాధ్యపడలేదని తెలిపారు.

అయ్యర్ ఐపీఎల్‌లో 115 మ్యాచ్‌లకు పైగా సగటు 32.24 తో ఆడి 127.48 స్ట్రైక్ రేట్ తో  3,127 పరుగులు సాధించాడు. కెరీర్‌లో 21 అర్ధ సెంచరీలతో మిడిల్ ఆర్డర్‌లో అతని స్థిరత్వం, ప్రభావం స్పష్టమవుతాయి. 2024 సీజన్‌లో 146.86 స్ట్రైక్ రేట్‌తో 14 మ్యాచ్‌లలో 351 పరుగులు చేసి, అతను తన ప్రతిభను మరింత ప్రతిష్టిత స్థాయికి చేర్చాడు.

అంతర్జాతీయ స్థాయిలో కూడా శ్రేయాస్ అయ్యర్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2020లో న్యూజిలాండ్‌పై తన మొదటి ODI సెంచరీ సాధించడంతో పాటు, టెస్ట్ అరంగేట్రం సమయంలోనూ చక్కని ప్రదర్శన చేశాడు. వెన్నునొప్పి సమస్యలతో అతను కొంతకాలం ఆటకు దూరమై తిరిగి వచ్చినప్పటికీ, KKR కెప్టెన్‌గా 2024 సీజన్‌ను విజయవంతంగా ముగించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌తో అతని కొత్త ప్రయాణం మరింత రసవత్తరంగా మారనుంది.