IPL 2025: ముంబై‌పై ఘన విజయం.. కట్‌చేస్తే.. పంత్‌తోపాటు దిగ్వేష్ రతికి జరిమానా.. ఎందుకో తెలుసా?

Lucknow Super Giants Players Pant and Digvesh Rathi Fined: ఐపీఎల్ 16వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యువ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి విజయంలో కీలకంగా మారాడు.

IPL 2025: ముంబై‌పై ఘన విజయం.. కట్‌చేస్తే.. పంత్‌తోపాటు దిగ్వేష్ రతికి జరిమానా.. ఎందుకో తెలుసా?
Srh Vs Lsg

Updated on: Apr 05, 2025 | 8:25 PM

LSG’s Pant and Digvesh Rathi fined: ఐపీఎల్ 16వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యువ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి విజయంలో కీలకంగా మారాడు. ఎందుకంటే, ముంబై ఇండియన్స్ మంచి ఆరంభాన్ని అందించింది. కానీ, లక్నో అందించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో మాత్రం తడబడింది.

ఇక దిగ్వేష్ రాఠి స్పిన్ బౌలింగ్‌లో ముంబై బ్యాటర్లు పరుగులు సాధించడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దిగ్వేష్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతను 1 వికెట్ కూడా తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు రన్ రేట్‌ను నియంత్రించడంలో దిగ్వేష్ రాఠి కీలక పాత్ర పోషించాడు.

విశేషమేమిటంటే, ఈ మ్యాచ్‌లో దిగ్వేష్ రతి నమన్ ధీర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి నోట్‌బుక్ రాస్తున్నట్లుగా సెలబ్రేష్సన్స్ చేసుకున్నాడు. ఈ వేడుకపై అభ్యంతరం తెలిపిన బీసీసీఐ.. ఈ బౌలర్‌పై జరిమానా విధించింది. దీంతో రతి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ రాఠి నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దిగ్వేష్‌కు మ్యాచ్ ఫీజులో 25% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.

ఇప్పుడు ఆ తప్పును పునరావృతం చేసిన దిగ్వేష్ రతికి అతని మ్యాచ్ ఫీజులో 50% జరిమానా, 2 డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు. అయితే, ఈ మ్యాచ్‌కు దిగ్వేష్ రాఠి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోవడం విశేషం.

అలాగే, ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు రూ. 12 లక్షల జరిమానా విధించారు. బౌలింగ్ చేసే జట్టు 20 ఓవర్లు పూర్తి చేయడానికి నిర్దేశించిన సమయం 90 నిమిషాలు. ఈ సమయం పూర్తి కావడంతో.. 19వ ఓవర్ తర్వాత 30 గజాల సర్కిల్ వెలుపల ఒక ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది.

సస్పెన్షన్‌కు దారితీస్తుందా?

ఐపీఎల్ కొత్త నియమం ప్రకారం, స్లో ఓవర్ రేట్‌తో ఎఫెక్ట్ అయిన కెప్టెన్లకు మ్యాచ్ నిషేధం విధించరు. బదులుగా కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లు మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..