SRH Vs PBKS: బుద్దున్నోడిలా అలోచించావ్ కాక.! జట్టులోకి మాంత్రికుడు.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచేందుకు ప్యాట్ కమిన్స్ తుది జట్టులో కీలక మార్పులు చేసినట్టు తెలుస్తోంది. జట్టులోకి మాంత్రికుడు వచ్చేశాడు. మరి ఆ ప్లేయర్స్ ఎవరంటే ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ 2025లో ఏప్రిల్ 12న శనివారం డబుల్ డెక్కర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుండగా.. రెండో మ్యాచ్ ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఇదే కీలక మ్యాచ్. ఇందులో కచ్చితంగా సన్‌రైజర్స్ గెలవాల్సిందే. వరుసగా 4 మ్యాచ్‌లలో ఓటమిపాలైన సన్‌రైజర్స్ మళ్లీ.. ఈ మ్యాచ్‌తో గెలుపు బాట పట్టడమే కాదు.. ప్లేఆఫ్స్ ఆశలు కూడా సజీవంగా ఉంచుకోవాలని అనుకుంటోంది.
ఈ క్రమంలోనే శనివారం జరగబోయే మ్యాచ్‌కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కోచ్ డానియల్ విటోరి జట్టులో కీలక మార్పులు చేశారట. బౌలింగ్‌లో వరుసగా విఫలమవుతున్న సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, కమిందు మెండీస్‌లను పక్కనపెట్టి.. స్పిన్ విభాగంలో రాహుల్ చాహర్‌కు ప్లేస్ ఇవ్వాలని చూస్తున్నారట. అలాగే మరో స్పిన్నర్ ఆడమ్ జంపాను కూడా సరైన సమయంలో ఉపయోగించుకోవాలని చూస్తోంది SRH. అటు బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. కానీ క్లాసెన్‌ను మూడు, లేదా నాలుగో స్థానంలో ఆడించే అవకాశం ఉందట. బౌలింగ్‌లో ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, ముల్దర్‌లు తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి చూడాలి ఈ మ్యాచ్‌తోనైనా కూడా మళ్లీ తిరిగి సన్‌రైజర్స్ గాడిలో పడుతుందో లేదో..!
సన్ రైజర్స్ తుది జట్టు(అంచనా):
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, షమీ, రాహుల్ చహర్/ఆడమ్ జంపా
First the stare, then the no look hit 💥
Travis Head | Heinrich Klaasen | #PlayWithFire | #SRHvPBKS | #TATAIPL2025 pic.twitter.com/s3bXvxQRaw
— SunRisers Hyderabad (@SunRisers) April 12, 2025
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..