
CSK vs PBKS Preview and Prediction: ఐపీఎల్ (IPL) 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ బుధవారం, ఏప్రిల్ 30న జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ప్లేఆఫ్స్ పరంగా ఈ మ్యాచ్ రెండు జట్లకు ఎంతో కీలకమైంది. అయితే, చెన్నైకి ఈ మ్యాచ్ డు ఆర్ డై పరిస్థితిలా మారింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ప్రస్తుత సీజన్‌లో చాలా పేలవంగా ప్రదర్శన ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే టాప్ 4 రేసు నుంచి తొలగిపోతుంది. అలాగే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగిన తొలి జట్టుగా మారనుంది. అందుకే ఎంఎస్ ధోని తన జట్టు పంజాబ్ కింగ్స్‌పై ఎలాగైనా గెలవాలని కోరుకుంటుంది. మరోవైపు, పంజాబ్ జట్టు మళ్లీ విజయాల పరంపరను కొనసాగించి, ప్లేఆఫ్ అవకాశాలను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ రెండోసారి తలపడనున్నాయి. అంతకుముందు, ఏప్రిల్ 8న ముల్లన్‌పూర్‌లో రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 18 పరుగుల తేడాతో గెలిచింది. చెన్నై తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలవగా, పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకప్పుడు పంజాబ్ కింగ్స్‌పై చాలా బలమైన రికార్డును కలిగి ఉంది. కానీ, ఇటీవలి కాలంలో చెన్నై ఎన్నో మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వస్తోంది. ఈ కారణంగా, రెండింటి మధ్య గెలుపు ఓటమిల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా మారింది. ఇప్పటివరకు చెన్నై (CSK) వర్సెస్ పంజాబ్ (PBKS) మధ్య 31 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై 16 మ్యాచ్‌లు, పంజాబ్ 15 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, గత 5 మ్యాచ్‌ల్లో పంజాబ్ 4 సార్లు గెలిచింది.
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టు గురించి మాట్లాడితే, పంజాబ్‌ను ఖచ్చితంగా ఫేవరెట్ అని పిలవవచ్చు. దీనికి పెద్ద కారణం చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనే కారణం. ఇటు బ్యాటింగ్, అంటు బౌలింగ్ రెండింటిలోనూ దారుణంగా విఫలమవుతోంది. మరోవైపు, పంజాబ్ జట్టు బ్యాటింగ్, బంతితో చాలా బాగా రాణిస్తోంది.
పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కీపర్), నేహల్ వాధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్/జేవియర్ బార్ట్‌లెట్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్.
చెన్నై సూపర్ కింగ్స్: షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, దీపక్ హుడా, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివం దుబే, ఎంఎస్ ధోని(కెప్టెన్/కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మథీషా పతిరానా, అన్షుల్ కాంబోజ్/ఆర్ అశ్విన్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..