Jofra Archer: నిద్రపోతున్నోడిని లేపారని.. గ్రౌండ్‌లోకి వచ్చి రచ్చ రచ్చ చేశాడు!

IPL 2025లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మ్యాచ్‌ సమయంలో నిద్రపోతూ కెమెరాల్లో చిక్కిన విషయం ఆసక్తికరంగా మారింది. నిద్రలేచిన అతను అద్భుతమైన బౌలింగ్‌తో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య వంటి కీలక ఆటగాళ్లను అవుట్ చేశాడు. ఈ విజయంలో ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు.

Jofra Archer: నిద్రపోతున్నోడిని లేపారని.. గ్రౌండ్‌లోకి వచ్చి రచ్చ రచ్చ చేశాడు!
Jofra Archer

Updated on: Apr 06, 2025 | 3:55 PM

ఐపీఎల్‌ 2025లో భాగంగా శనివారం రాత్రి పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చి.. ఈ సీజన్‌లో ఓటమి ఎరుగని పంజాబ్‌ను పూర్తిగా డామినేట్ చేసి.. వారి తొలి పరాజయాన్ని పరిచయం చేసింది. అయితే ఇదే మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో నిద్రపోతున్న ఓ ప్లేయర్‌ను సహచరులు నిద్రలేపారు. అంతే పడుకున్నోడిని లేపుతారంటూ.. ఆ ప్లేయర్‌ గ్రౌండ్‌లో రచ్చ రచ్చ చేశాడు. ఇంతకీ స్టోరీ ఏంటంటే.. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్ తమ టీమ్‌ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఓ కునుకేశాడు. హాయిగా దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు.

ఆ దృశ్యాలు కెమెరామెన్‌ కంట పడ్డాయి. అయితే రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత.. ఇక బౌలింగ్‌ వేయాలి రెడీ అవ్వమాని టీమ్‌మేట్స్‌ అతన్ని నిద్రలేపారు. అంతే నిద్రలోంచి లేపగా.. బౌలింగ్‌కు వెళ్లి తొలి ఓవర్‌లోనే అంత షేక్‌ చేసి పడేశాడు. నిద్రలో నుంచి లేచి మొఖం కడుక్కొని బౌలింగ్‌కి వచ్చీ రాగానే తన రా పేస్ ఆటతో తొలి ఓవర్ లోనే కీలక వికెట్లు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (10), ప్రియాంశ్ ఆర్య (0)ను అవుట్‌ చేశాడు. ప్రియాంష్ ఆర్య ను డక్ ఔట్ చేసిన ఆర్చర్… సూపర్‌ ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ను కూడా బౌల్డ్ చేశాడు. దీంతో పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయింది పంజాబ్ కింగ్స్. ఇక చివర్లో అర్షదీప్ సింగ్ వికెట్ కూడా తీశాడు ఆర్చర్.

అలా ఈ మ్యాచులో అతడు పంజాబ్ కింగ్స్ ను వణికించాడు. అయితే ఈ సీజన్ తొలి రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండానే ఏకంగా 109 పరుగులు సమర్పించుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. కానీ, చెన్నై సూపర్ కింగ్స్ పై గట్టి కమ్ బ్యాక్ ఇచ్చాడు. తన బ్రిలియంట్ స్వింగ్ అండ్ పేస్ బౌలింగ్ తో ఒక్క వికెట్ తీసి 13 పరుగులే ఇచ్చాడు. ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ పై కూడా అదే ఫైర్ అండ్ ఎనర్జీతో చెలరేగి అద్భుత ప్రదర్శన కనబర్చి.. రాజస్థాన్‌కు స్టన్నింగ్‌ విక్టరీ అందించాడు. కీలక వికెట్లు తీయడంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..