
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2024లో అత్యంత ప్రభావశీలమైన జట్లలో ఒకటిగా నిలిచింది. అద్భుతమైన ఆటతీరుతో టోర్నమెంట్‌ను రెండవ అత్యుత్తమ జట్టుగా ముగించిన SRH, 2025 సీజన్ కోసం మరింత మెరుగైన వ్యూహాలను రూపొందించుకోవాలి. వేలానికి ముందు ఐదుగురు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న SRH, జట్టును బలోపేతం చేసేందుకు అనేక మంది నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయినప్పటికీ, వారి ప్లేయింగ్ XI విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
SRH 2025 వేలంలో ఇషాన్ కిషన్‌ను ₹11.25 కోట్లకు కొనుగోలు చేసింది. సహజంగా ఓపెనర్ అయిన కిషన్, SRHలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి బ్యాటర్లు ఉన్నందున టాప్ ఆర్డర్‌లో స్థానం దక్కించుకోవడం కష్టమే. కాబట్టి, జట్టులో బ్యాటింగ్ సమతుల్యతను కాపాడేందుకు కిషన్‌ను నాలుగో స్థానంలో నిలిపితే బెటర్.
ఇందులో భాగంగా, నితీష్ కుమార్ రెడ్డిని మూడో స్థానంలో, కిషన్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయించాలి. కిషన్‌కు మిడిల్ ఆర్డర్‌లో ఆడిన అనుభవం ఉంది. గత ఐపీఎల్ సీజన్లలో నాలుగో స్థానంలో 23 ఇన్నింగ్స్ ఆడిన అతను 28.28 సగటుతో 594 పరుగులు చేశాడు. అతని 129.97 స్ట్రైక్ రేట్, మూడు అర్ధ సెంచరీలు అతను మిడిల్ ఆర్డర్‌లో సమర్థవంతంగా ఆడగలడు అనే నమ్మకాన్ని ఇస్తాయి.
SRH లోయర్ మిడిల్ ఆర్డర్‌లో పేస్ హిట్టింగ్ అవసరాన్ని తీర్చగల ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. వాళ్ళే సచిన్ బేబీ, అభినవ్ మనోహర్. అయితే, పేస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం, ఇటీవల అతను చూపిన మెరుగుదల దృష్ట్యా అభినవ్‌ను ముందుగా ఎంపిక చేయాలి.
అతను 2023 మహారాజా T20 ట్రోఫీలో 11 ఇన్నింగ్స్‌లలో 78.57 సగటుతో, 194.35 స్ట్రైక్ రేట్‌తో 550 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతను ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే అత్యుత్తమ హిట్టర్లలో ఒకడిగా నిలిచాడు. అంతేకాకుండా, IPLలో 152.17 స్ట్రైక్ రేట్, 4.38 బంతుల-బౌండరీ నిష్పత్తి అతను వేగంగా స్కోర్ చేయగలడని సూచిస్తుంది.
గతంలో గుజరాత్ టైటాన్స్ అతన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయినా, SRH అతనిని సరైన విధంగా ఉపయోగించుకుని మెరుగైన ఫలితాలు అందుకోవాలి.
IPL 2025 వేలంలో SRH సిమర్జీత్ సింగ్‌ను ₹1.50 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో CSKలో ఉన్నప్పటికీ, అతను అక్కడ ఎక్కువ అవకాశాలు పొందలేదు. SRHలో పేస్ బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్ ఉన్నారు.
షమీ కొత్త బంతితో, హర్షల్ డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయగలరు. కమిన్స్‌ను మిడిల్ ఓవర్ల ఎన్‌ఫోర్సర్‌గా ఉపయోగించేందుకు, సిమర్జీత్‌ను పవర్‌ప్లేలో లేదా మిడిల్ ఓవర్లలో పేస్ బౌలర్‌గా ప్రయోగించాలి. భువనేశ్వర్ కుమార్ లేని పరిస్థితిలో, సిమర్జీత్ పవర్‌ప్లేలో బౌలింగ్ చేయడం SRHకు ఉపయుక్తంగా ఉంటుంది.
ఈ విధంగా SRH తన ప్లేయింగ్ XIలో సరైన మార్పులు చేసుకుంటే, IPL 2025లో మరింత బలమైన జట్టుగా నిలిచి, టైటిల్ గెలుచే అవకాశాలను పెంచుకోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..