IPL 2025: అలా చేస్తే ఐపీఎల్ నుంచి 2 ఏళ్లపాటు నిషేధించాలి: క్రికెటర్లకు షాకిచ్చిన కావ్య మారన్

|

Aug 02, 2024 | 1:38 PM

ఐపీఎల్‌లో చాలాసార్లు ఆటగాళ్లు మినీ వేలానికి నేరుగా వచ్చి అత్యధిక ప్రైజ్ పొందుతుంటారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ రూ.24 కోట్లకు పైగా దక్కించుకున్నాడు. అదే సమయంలో, IPL 2022కి ముందు జరిగిన మెగా వేలంలో, అత్యంత ఖరీదైన ఆటగాడికి 16 కోట్ల రూపాయల కంటే తక్కువ లభించింది. ఈ కారణంగా, ఫ్రాంచైజీలు పెద్ద ఆటగాళ్లను నేరుగా మెగా వేలానికి రావాలని, వారు విక్రయించకపోతే మినీ వేలంలో పాల్గొనాలని కోరుతున్నారు.

IPL 2025: అలా చేస్తే ఐపీఎల్ నుంచి 2 ఏళ్లపాటు నిషేధించాలి: క్రికెటర్లకు షాకిచ్చిన కావ్య మారన్
Ipl 2025
Follow us on

IPL 2025 Update: కొంతకాలంగా, IPLలో సీజన్ ప్రారంభానికి ముందే విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను ఉపసంహరించుకునే ట్రెండ్ కొనసాగుతోంది. లీగ్ 17వలోనూ ఇది కనిపించింది. గత సీజన్‌లో, జాసన్ రాయ్‌తో చాలా మంది ఇతర ఆటగాళ్ళు ఇలానే చేశారు. దీని కారణంగా జట్టు కలయికలను సరిదిద్దడంలో ఆయా ఫ్రాంచైజీలు ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి, వేలంలో కొనుగోలు చేసిన తర్వాత, ఎటువంటి సరైన కారణం లేకుండా వారి పేర్లను ఉపసంహరించుకునే ఆటగాళ్లపై 2 సంవత్సరాల నిషేధం విధించాలని అన్ని ఫ్రాంచైజీలు సూచించాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో గాయం కారణంగా శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా IPL 2024 నుంచి వైదొలగడం పట్ల కావ్య మారన్ టీం SRH చాలా అసంతృప్తికి గురైంది.

ఐపీఎల్‌ నుంచి వైదొలగడం ఆటగాళ్లకు ఎఫెక్ట్..

వ్యక్తిగత కారణాలతో కొత్త సీజన్ నుంచి విదేశీ ఆటగాళ్లు వైదొలగడం వల్ల చాలా IPL జట్లు ప్రభావితమయ్యాయి. ఈ విదేశీ ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు పన్నడం ఇబ్బండి మారింది. అలాగే, ఆకస్మికంగా జట్టు నుంచి తప్పుకోవడం వల్ల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడానికి ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : IPL 2025: ఆ రోజే నిర్ణయం.. ఐపీఎల్ వీడ్కోలుపై ధోనీ షాకింగ్ కామెంట్స్..

అయితే, ఓ ఆటగాడు అతని బోర్డు తిరస్కరించినట్లయితే లేదా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడవలసి వస్తే ఈ నియమం వర్తించదు. సదరు ఆటగాడు సొంత కారణాలతో తప్పుకుంటే నిషేధం విదించాలని కోరుకుతున్నారు.

మినీ వేలంలో ఎంట్రీపైనే నిషేధం..

ఐపీఎల్‌లో చాలాసార్లు ఆటగాళ్లు మినీ వేలానికి నేరుగా వచ్చి అత్యధిక ప్రైజ్ పొందుతుంటారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ రూ.24 కోట్లకు పైగా దక్కించుకున్నాడు. అదే సమయంలో, IPL 2022కి ముందు జరిగిన మెగా వేలంలో, అత్యంత ఖరీదైన ఆటగాడికి 16 కోట్ల రూపాయల కంటే తక్కువ లభించింది. ఈ కారణంగా, ఫ్రాంచైజీలు పెద్ద ఆటగాళ్లను నేరుగా మెగా వేలానికి రావాలని, వారు విక్రయించకపోతే మినీ వేలంలో పాల్గొనాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి : ఎవడ్రా సామీ.. సింపుల్‌గా వచ్చి పతకం పట్టేశాడు.. ఇంటర్నెట్ సెన్సెషన్‌గా మారిన టర్కిష్ అథ్లెట్

జులై 31 న, ముంబైలో BCCI, అన్ని IPL ఫ్రాంచైజీల యజమానుల సమావేశం జరిగింది. దీనిలో మెగా వేలం, లీగ్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు చర్చించారు. అన్ని సిఫార్సులను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముందు ఉంచుతామని బీసీసీఐ తెలిపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..