RCB vs RR, IPL 2024: మెరుపుల్లేవ్.. నిరాశపర్చిన ఆర్సీబీ బ్యాటర్లు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

|

May 23, 2024 | 4:28 PM

Royal Challengers Bangalore Vs Rajasthan Royals: కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. కనీసం ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయారు. రజత్ పాటిదార్ (34) చేసిన పరుగులే ఆర్సీబీలో అత్యధికం.

RCB vs RR, IPL 2024: మెరుపుల్లేవ్.. నిరాశపర్చిన ఆర్సీబీ బ్యాటర్లు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
RCB vs RR, IPL 2024
Follow us on

Royal Challengers Bangalore Vs Rajasthan Royals: కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. కనీసం ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయారు. రజత్ పాటిదార్ (34) చేసిన పరుగులే ఆర్సీబీలో అత్యధికం. విరాట్ కోహ్లీ (33), డుప్లెసిస్ (17), కామెరూన్ గ్రీన్ (27), మ్యాక్స్ వెల్ (0), మహిపాల్ లోమ్రోర్ (32), దినేశ్ కార్తీక్ (11).. ఇలా టాప్ బ్యాటర్లందరూ నిరాశపర్చారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీయగా.. అశ్విన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, చాహల్‌, సందీప్‌ శర్మ తలో వికెట్‌ తీశారు. మరి ఇప్పుడీ స్కోరును ఆర్సీబీ కాపాడుకుంటుందా? లేదా? అన్నది మరికొన్ని నిమిషాల్లో తేలనుంది.

 

ఇవి కూడా చదవండి

 

ఒక్కరూ కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయారు…

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్ వైషాక్, హిమాన్షు శర్మ

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్  ప్లేయర్లు: 

శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా, నాంద్రే బర్గర్, షిమ్రాన్ హెట్మేయర్, తనుష్ కోటియన్

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..