Sunrisers Hyderabad vs Rajasthan Royals: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్‌లో నూ తమ బ్యాటింగ్ పవర్ ను రుచి చూపించారు. ముఖ్యంగా తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే ఓపెనర్ ట్రావిస్ హెడ్ ( 44 బంతుల్లో 58, 6 ఫోర్లు, 3 సిక్స్ లు) అర్ధ సెంచరీతో అలరించాడు. ఆక ఆఖరులో హెన్రిచ్ క్లాసెన్ 19 బంతుల్లో 42, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. దీంతో హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు. కాగా ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం సన్ రైజర్స్ కు తప్పనిసరి.
A Flat batted Maximum, ft Heinrich Klaasen 💪
ఇవి కూడా చదవండిHis late flourish helped #SRH get past the 2️⃣0️⃣0️⃣ mark 💥 👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvRR | @SunRisers pic.twitter.com/rLif1wxgiu
— IndianPremierLeague (@IPL) May 2, 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్
ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, ఐడెన్ మర్క్రమ్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ
జోస్ బట్లర్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, తనుష్ కోటియన్
Travis Head breaking the shackles 👊#SRH on the move and reach 75/2 at the halfway stage 🙌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvRR | @SunRisers pic.twitter.com/O5LwdS8LBa
— IndianPremierLeague (@IPL) May 2, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..