IPL 2024: కోహ్లీ అభిమానిని ఘోరంగా కొట్టిన సెక్యూరిటీ.. బయటకు ఈడ్చుకెళ్లి.. కాళ్లతో తన్నుతూ.. వీడియో

IPL 2024 ఆరో మ్యాచ్‌లో అంటే సరిగ్గా హోలీ రోజున, విరాట్ కోహ్లీ మళ్లీ చెలరేగాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 49 బంతుల్లో 77 పరుగులు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన అందరి హృదయాలను కదిలించింది.

IPL 2024: కోహ్లీ అభిమానిని ఘోరంగా కొట్టిన సెక్యూరిటీ.. బయటకు ఈడ్చుకెళ్లి.. కాళ్లతో తన్నుతూ.. వీడియో
Virat Kohli

Updated on: Mar 27, 2024 | 4:53 PM

IPL 2024 ఆరో మ్యాచ్‌లో అంటే సరిగ్గా హోలీ రోజున, విరాట్ కోహ్లీ మళ్లీ చెలరేగాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 49 బంతుల్లో 77 పరుగులు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన అందరి హృదయాలను కదిలించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి గ్రౌండ్ లోకి పరుగు పరుగున వచ్చాడు. విరాట్ కోహ్లీ పాదాలకు నమస్కరించాడు. దీంతో భద్రతా సిబ్బంది సదరు అభిమానిని బయటకు తీసుకెళ్లారు. అక్కడితో ఆ వ్యక్తిని వదిలేసి ఉంటారులే అనుకున్నారు చాలా మంది. అయితే అలా జరగలేదు. సెక్యూరిటీ గార్డులు ఆ అభిమానిని బౌండరీ లైన్ నుంచి బయటకు తీశారు. సుమారు 5 నుంచి 7 గురుఆ అభిమానిపై పిడిగుద్దులు కురిపించారు.కాళ్లతో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వాళ్లు అసలు మనుషులేనా?’ అంటూ సెక్యూరిటీని తిట్టేస్తున్నారు. అదే సమయంలో ఆర్సీబీ యాజమాన్యంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మ్యాచ్ జరుగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి ప్రవేశించడం సరికాదు. ఆ విషయంలో అభిమాని చేసింది తప్పే. అయితే ఇందులో భద్రతా సిబ్బంది వైఫల్యం కూడా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఒకరిని ఇలా కొట్టడం సరైనదేనా? మరి ఈ విషయంలో స్టేడియం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అదే సమయంలో ఇప్పటికైనా అభిమానులంతా రూల్స్ ఫాలో అవ్వడంపైనే దృష్టి పెట్టాలి.

విరాట్ కోహ్లీ పాదాలకు నమస్కరిస్తోన్న అభిమాని..

 

KKRతో తదుపరి మ్యాచ్‌

RCB తదుపరి మ్యాచ్ మార్చి 29న కోల్‌కతాతో జరుగుతుంది. RCB జట్టు ఈ మ్యాచ్‌ని తన సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మాత్రమే ఆడనుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి చాలా బలంగా ఉంది. కోల్‌కతా తన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను 4 పరుగుల తేడాతో ఓడించింది.

ఇంత దారుణమా?

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..