IPL 2024: రికార్డ్‌ల తాట తీసిన ఐపీఎల్ 2024.. వ్యూవర్ షిప్‌లో టాప్ లేపిందిగా..

|

Aug 30, 2024 | 10:35 AM

Mukesh Ambani Statement on IPL 2024 Viewership: IPL ప్రపంచంలోనే అతిపెద్ద, విజయవంతమైన T20 లీగ్ అనడంలో సందేహం లేదు. ప్రతి సంవత్సరం దీని ప్రజాదరణ పెరుగుతోంది. IPL 2024 కారణంగా , BCCI ఆదాయాలు భారీగా పెరిగాయి. ఐపీఎల్ 2024 సందర్భంగా, వీక్షకుల జాబితాలో లీగ్ మునుపటి సీజన్ రికార్డులు కూడా బద్దలయ్యాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు.

IPL 2024: రికార్డ్‌ల తాట తీసిన ఐపీఎల్ 2024.. వ్యూవర్ షిప్‌లో టాప్ లేపిందిగా..
Ipl 2024
Follow us on

Mukesh Ambani Statement on IPL 2024 Viewership: IPL ప్రపంచంలోనే అతిపెద్ద, విజయవంతమైన T20 లీగ్ అనడంలో సందేహం లేదు. ప్రతి సంవత్సరం దీని ప్రజాదరణ పెరుగుతోంది. IPL 2024 కారణంగా , BCCI ఆదాయాలు భారీగా పెరిగాయి. ఐపీఎల్ 2024 సందర్భంగా, వీక్షకుల జాబితాలో లీగ్ మునుపటి సీజన్ రికార్డులు కూడా బద్దలయ్యాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు.

అభిమానులు జియో సినిమాలో IPL 2024ని బాగా ఆస్వాదించిన ముఖేష్ అంబానీ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ‘జియో సినిమా డిజిటల్ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. తక్కువ సమయంలోనే గొప్ప విజయాలు సాధించింది. ఐపీఎల్ 2024 జియో సినిమాకు చాలా బాగుంది. 62 కోట్ల మంది దీనిని ఆస్వాదించారు. గత సీజన్‌తో పోలిస్తే ఇది 38 శాతం అధికం. మొత్తం వీక్షకుల సంఖ్య 50 శాతం పెరిగింది. ఇది ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన ప్రత్యక్ష ప్రసార ఈవెంట్‌గా మారింది. ఈ విజయం పారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా కొనసాగింది.

జియో సినిమా కంపెనీ వయాకామ్ 18 IPL 2023 నుంచి 2027 వరకు డిజిటల్ హక్కులను దక్కించుకుంది. కాగా, గత ఏడాది రూ. 27 వేల 758 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి మంచి లాభాలు వస్తున్నాయి. ఐపీఎల్‌కు ఆదరణ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ జట్టు ముంబై ఇండియన్స్ ప్రదర్శన పేలవం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ జట్టు కూడా IPLలో పాల్గొంటుంది. దీని పేరు ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో, జట్టు 14 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచింది. ప్లేఆఫ్‌కు రేసు నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

చాలా మంది అభిమానులు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడమే జట్టు పేలవమైన ప్రదర్శనకు కారణమంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, ముంబై ఫ్రాంచైజీ కూడా తన వ్యూహాన్ని సిద్ధం చేయడంలో బిజీగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌లో వేలం జరిగే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..