
IPL 2024, Virat Kohli: ఎట్టకేలకు విరాట్ కోహ్లీ (Virat Kohli) మార్చి 17న భారత్‌లో అడుగుపెట్టాడు. కోహ్లి భారత్‌కు వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంటే అతను త్వరలో తన IPL (IPL 2024) జట్టు RCBలో చేరి వెంటనే శిక్షణను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, మార్చి 19న, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ అన్‌బాక్స్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ ఈవెంట్‌లో విరాట్ పాల్గొంటాడని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కోహ్లీ భారత్‌లో అడుగుపెట్టాడు. 2 నెలలకుపైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న కోహ్లి.. కొడుకు అకాయ్ పుట్టడంతో లండన్‌లో ఫ్యామిలీతో గడిపాడు. ఇప్పుడు ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చిన కోహ్లి, ఆర్‌సీబీ తరపున లీగ్ మొత్తం ఆడతానని ధృవీకరించాడు.
ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్ టీమ్ ఇండియా నుంచి సెలవు తీసుకున్నాడు. తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లి ఔట్ అవుతాడని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత మొత్తం సిరీస్‌లో విరాట్ ఆడడని కన్ఫర్మ్ అయింది. దీనిపై పత్రికా ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ.. వ్యక్తిగత కారణాల వల్లే విరాట్ జట్టుకు దూరమయ్యాడని పేర్కొంది. తరువాత, విరాట్, అనుష్క సంయుక్తంగా తమ రెండవ బిడ్డ అకాయ్ గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
THE GOAT HAS REACHED INDIA. 🐐 [Viral Bhayani]
– The wait is over for all cricket fans….!!!!pic.twitter.com/Vs2SPrG984
— Johns. (@CricCrazyJohns) March 17, 2024
ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, విరాట్ కోహ్లి ఇండియాకు తిరిగి వచ్చాడు. అతను ఈసారి ఐపీఎల్‌లో ఆడతాడని ధృవీకరించాడు. ఐపీఎల్‌లో కోహ్లి ఆడటం అనుమానంగా ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే భారత్ చేరుకున్న విరాట్ బెంగళూరులోని రాయల్ ఛాలెంజర్స్ క్యాంపులో చేరి శిక్షణ ప్రారంభించనున్నాడు. గత 2 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, 2024 జనవరి 17న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు.
IPL 2024 ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పోటీపడనుంది. అంటే, మార్చి 22న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది. ఫిబ్రవరి 15న కొడుకు అకాయ్ పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీకి ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..