
Gujarat Titans vs Chennai Super Kings: : చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు జూలు విదిల్చారు. సెంచరీల మోత మోగించి చెన్నై జట్టుకు భారీ లక్ష్యాన్ని ముందుంచారు. ఈ మ్యాచ్ లోచెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ (55 బంతుల్ 104, 9 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ ( 51 బంతుల్లో 103, 5ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీలతో చెన్నైపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 210 పరుగులు జోడించారు. తద్వారా లక్నోకు చెందిన కేఎల్ రాహుల్, డికాక్ జోడీ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. . డేవిడ్ మిల్లర్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షారుఖ్ ఖాన్ 2 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీశాడు.
సాయి సుదర్శన్ 51 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 201.96 స్ట్రైక్ రేట్‌తో 103 పరుగులు చేశాడు.
That memorable moment 😍
Sai Sudharsan goes back for a scintillating knock but not before thoroughly entertaining the crowd 👏💯
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #GTvCSK pic.twitter.com/VRF5VGDiVg
— IndianPremierLeague (@IPL) May 10, 2024
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి
అభినవ్ మనోహర్, సందీప్ వారియర్, BR శరత్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్
రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్
అజింక్యా రహానే, షేక్ రషీద్, అరవెల్లి అవనీష్, సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరి
కాగా, శుభ్‌మన్ గిల్ 55 బంతుల్లో 6 సిక్సర్లు, 9 ఫోర్లతో 189.09 స్ట్రైక్ రేట్‌తో 104 పరుగులు చేశాడు.
Shubman Gill brings up #TATAIPL‘s 100th 💯
The captain leading from the front for @gujarat_titans 🫡
Follow the Match ▶️ https://t.co/PBZfdYswwj#TATAIPL | #GTvCSK pic.twitter.com/sX2pQooLx0
— IndianPremierLeague (@IPL) May 10, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..