ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శుక్రవారం (మే 18)లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఐపీఎల్ 2024లో ముంబైకి ఇదే చివరి మ్యాచ్. ఇందులో వారికి పరాజయమే పలకరించింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకుంది. కాగా సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. అయితే అది ముంబై ఇండియన్స్ అభిమానులకు కోపం తెప్పించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో రోహిత్ శర్మ ఫామ్ యావరేజ్‌గా ఉంది. అలాగే ఈ సీజన్ తర్వాత రోహిత్ ముంబై నుంచి తప్పుకోనున్నాడని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ మాట్లాడుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో కానీ కచ్చితంగా తెలియడం లేదు కానీ.. రోహిత్ అయితే ముంబై ఇండియన్స్‌ను వీడడని కొందరు అభిమానులు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.
కాగా లక్నోతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ 68 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మాజీ కెప్టెన్ అద్భుత ఇన్నింగ్స్‌ను చూసి వాంఖడే స్టేడియంలో ప్రేక్షకులు పులకించిపోయారు. ఇందుకు గానూ మ్యాచ్ అనంతరం ఎంఐ డ్రెస్సింగ్ రూమ్‌లో ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ రోహిత్‌కు ప్రత్యేక పతకాన్ని అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
तोडफोड from the get-go, a 𝐭𝐲𝐩𝐢𝐜𝐚𝐥 𝐑𝐨 𝐩𝐞𝐫𝐟𝐨𝐫𝐦𝐚𝐧𝐜𝐞 was on display in #MIvLSG 💪💙#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/sddic4we6i
— Mumbai Indians (@mipaltan) May 18, 2024
కాగా గత సీజన్‌లో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గుజరాత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కానీ ముంబైకి ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. పాండ్యా నాయకత్వంలో ముంబై ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌లు ఆడింది. ఈ కాలంలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 10 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
Until next time… 🫡💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/njDXvnSpKB
— Mumbai Indians (@mipaltan) May 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..