IPL 2024 Points Table: హైదరాబాద్ విజయంతో మారిన పాయింట్స్ టేబుల్.. ఎస్‌ఆర్‌హెచ్ ఎక్కడుందంటే?
IPL 2024 మార్చి 22 నుంచి మే 26 వరకు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు, ముంబై ఇండియన్స్ (2013, 2015, 2017, 2019 మరియు 2020), చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011, 2018, 2021, 2023) అత్యధికంగా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాయి.

IPL 2024 Points Table: IPL 2024 18వ మ్యాచ్ శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (SRH vs CSK)ని ఓడించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 165/5 స్కోరు చేయగా, హైదరాబాద్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ సాధించింది.
SRH తరపున, ఓపెనర్ అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడుగా వ్యవహరించిన అభిషేక్ 12 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. హైదరాబాద్‌కు అభిషేక్ శుభారంభం అందించాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత, మార్క్రామ్ బాధ్యతలు స్వీకరించి 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
మే 26 వరకు టోర్నీ..
IPL 2024 మార్చి 22 నుంచి మే 26 వరకు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు, ముంబై ఇండియన్స్ (2013, 2015, 2017, 2019 మరియు 2020), చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011, 2018, 2021, 2023) అత్యధికంగా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 2 సార్లు, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్ ఒక్కోసారి టైటిల్ గెలుచుకున్నాయి. 2022లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం సీజన్‌లో టైటిల్‌ను గెలుచుకుంది.
10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు తన గ్రూప్‌లోని జట్లతో 2 సార్లు ఆడుతుంది. ఇతర గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒకసారి తలపడనుంది.
లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు..
లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగుతాయి. అందులో టాప్ 4 జట్లు క్వాలిఫైయర్/ఎలిమినేటర్‌కు అర్హత సాధిస్తాయి.
IPL 2024 పాయింట్ల పట్టిక..
| జట్టు | మ్యాచ్ | విజయం | ఓటమి | ఫలితం లేదు | పాయింట్లు | నికర రన్ రేట్ |
| కోల్‌కతా నైట్ రైడర్స్ | 3 | 3 | – | – | 6 | 2.518 |
| రాజస్థాన్ రాయల్స్ | 3 | 3 | – | – | 6 | 1.249 |
| చెన్నై సూపర్ కింగ్స్ | 4 | 2 | 2 | – | 4 | 0.517 |
| లక్నో సూపర్‌జెయింట్స్ | 3 | 2 | 1 | – | 4 | 0.483 |
| సన్‌రైజర్స్ హైదరాబాద్ | 4 | 2 | 2 | – | 4 | 0.409 |
| పంజాబ్ కింగ్స్ | 4 | 2 | 2 | – | 4 | -0.220 |
| గుజరాత్ టైటాన్స్ | 4 | 2 | 2 | – | 4 | -0.580 |
| రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 4 | 1 | 3 | – | 2 | -0.876 |
| ఢిల్లీ క్యాపిటల్స్ | 4 | 1 | 3 | – | 2 | -1.347 |
| ముంబై ఇండియన్స్ | 3 | – | 3 | – | 0 | -1.423 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








