KKR vs PBKS, IPL 2024: కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

|

Apr 26, 2024 | 9:50 PM

Kolkata Knight Riders vs Punjab Kings: కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చెలరేగారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ తమ జట్టుకు భారీ స్కోరు అందించారు. ముందుగా ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ( 37 బంతుల్లో 75, 6 ఫోర్లు, 6 సిక్సర్లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో అలరించారు

KKR vs PBKS, IPL 2024: కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
Kolkata Knight Riders
Follow us on

Kolkata Knight Riders vs Punjab Kings: కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చెలరేగారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ తమ జట్టుకు భారీ స్కోరు అందించారు. ముందుగా ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ( 37 బంతుల్లో 75, 6 ఫోర్లు, 6 సిక్సర్లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో అలరించారు. ఆ తర్వాత ఆండ్రీ రస్సెల్ (24), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28), వెంకటేశ్ అయ్యర్ (39) మెరుపులు మెరిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. రింకూ సింగ్ (5) నిరాశపర్చగా రమణ్ దీప్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కరన్‌, రాహుల్‌, హర్షల్‌ తలో వికెట్‌ తీశారు. కాగా ఈ మ్యాచ్ లో గెలవడం పంజాబ్ కు చాలా ముఖ్యం. మరి ఈ భారీ స్కోరును ఆ జట్టు ఛేదిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

 

ఇవి కూడా చదవండి

కోల్ కతా ప్లేయింగ్ ఎలెవన్.

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్ ), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా

ఇంపాక్ట్ ప్లేయర్ :

సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్

పంజాబ్ కింగ్స్  ప్లేయింగ్ ఎలెవన్

జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(కెప్టెన్), రిలీ రోసోవ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

ఇంపాక్ట్ ప్లేయర్ :

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిషి ధావన్, విధ్వత్ కావరప్ప, శివమ్ సింగ్, ప్రిన్స్ చౌదరి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.