AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: లోక్‌ సభ ఎన్నికల ఎఫెక్ట్‌.. ఐపీఎల్‌ 2024 ప్రారంభమయ్యేది అప్పుడే.. మ్యాచ్‌లు ఎక్కడంటే?

గత పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెల్చుకోని టీమిండియా ఈసారైనా వరల్డ్‌ కప్‌ను గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమ్ ఇండియాకు టీ20 మ్యాచ్‌లు లేవు. కాబట్టి టీమిండియా ప్లేయర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు, ప్రపంచ నంబర్ టీ20 లీగ్ గురించి ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది

IPL 2024: లోక్‌ సభ ఎన్నికల ఎఫెక్ట్‌.. ఐపీఎల్‌ 2024 ప్రారంభమయ్యేది అప్పుడే.. మ్యాచ్‌లు ఎక్కడంటే?
IPL 2024
Basha Shek
|

Updated on: Jan 22, 2024 | 2:42 PM

Share

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికల్లో జరగనుంది. గత పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెల్చుకోని టీమిండియా ఈసారైనా వరల్డ్‌ కప్‌ను గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమ్ ఇండియాకు టీ20 మ్యాచ్‌లు లేవు. కాబట్టి టీమిండియా ప్లేయర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు, ప్రపంచ నంబర్ టీ20 లీగ్ గురించి ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. Cricbuzz నివేదిక ప్రకారం, IPL 2024 మార్చి 22న ప్రారంభమవుతుంది. దాదాపు రెండు నెలల పాటు ఈ మెగా క్రికెట్‌ టోర్నీ కొనసాగుతుంది. మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ రెండుసార్లు జరిగింది. IPL 2009 పూర్తిగా భారతదేశం వెలుపల దక్షిణాఫ్రికాలో నిర్వహించగా, 2014 ఎడిషన్‌లోని కొన్ని మ్యాచ్‌లు UAEలో జరిగాయి. అయితే ఈసారి మొత్తం టోర్నీని భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది.

తమ ఆటగాళ్లు మొత్తం ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారని ఇతర అన్ని క్రికెట్ బోర్డుల నుంచి బీసీసీఐ హామీ వచ్చిందని తెలుస్తోంది. అయితే, T20 ప్రపంచ కప్ 2024 సమీపిస్తున్నందున, కొంతమంది ఆటగాళ్లు పూర్తి టోర్నమెంట్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కూడా ఫిబ్రవరి 22న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అది మార్చి 17తో ముగుస్తుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా, ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరగనుంది. అంటే ఈ టోర్నీ దాదాపు 2 నగరాల్లో జరగడం ఖాయం. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ ముంబైలో మాత్రమే నిర్వహించబడింది.

ఇవి కూడా చదవండి

గతేడాది ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియంలో 22 మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే ఈసారి టోర్నీని బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం, మహిళల ప్రీమియర్ లీగ్ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభమవుతుంది. టైటిల్ కోసం 5 జట్లు పోటీపడతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..