IPL 2024: రోహిత్‌కు గుడ్‌బై.. కోహ్లీకి హాయ్..! హార్దిక్ ఎంట్రీతో ముంబైని వీడనున్న బుమ్రా..

ఐపీఎల్ 2024 వేలానికి ముందుగా పలు సంచలనాలు నమోదవుతున్నాయ్. మొట్టమొదటిగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టూ ముంబై ట్రేడింగ్ వ్యవహారం ఐపీఎల్ చరిత్రలోనే సంచలనంగా మారింది. గాయాలతో సతమతమవుతున్న హార్దిక్‌ను 2021లో ముంబై వదులుకుంది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎన్నుకుని..

IPL 2024: రోహిత్‌కు గుడ్‌బై.. కోహ్లీకి హాయ్..! హార్దిక్ ఎంట్రీతో ముంబైని వీడనున్న బుమ్రా..
Jasprit Bumrah

Updated on: Nov 28, 2023 | 6:31 PM

ఐపీఎల్ 2024 వేలానికి ముందుగా పలు సంచలనాలు నమోదవుతున్నాయ్. మొట్టమొదటిగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టూ ముంబై ట్రేడింగ్ వ్యవహారం ఐపీఎల్ చరిత్రలోనే సంచలనంగా మారింది. గాయాలతో సతమతమవుతున్న హార్దిక్‌ను 2021లో ముంబై వదులుకుంది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎన్నుకుని.. తమ జట్టు పగ్గాలు అప్పగించింది. ఆ నమ్మకాన్ని వొమ్ము చేయకుండా.. 2022లో గుజరాత్‌ను ఐపీఎల్ విజేతగా నిలిపాడు హార్దిక్.

ఆ తర్వాత సంవత్సరంలో కూడా గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చిన హార్దిక్.. చెన్నై చేతిలో ఆఖరి నిమిషంలో ఓడిపోయాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2024 వేలానికి ముందుగా.. వార్తలు వచ్చినట్టు.. క్యాష్-ఆన్ ట్రేడ్ ప్రకారం గుజరాత్ నుంచి ముంబైకి మారాడు హార్దిక్ పాండ్యా.. ఇక ఈ ట్రేడింగ్‌తో ముంబై జట్టులో లుకలుకలు మొదలయ్యాయి. ఎంఐ పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఈ నిర్ణయానికి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల అతడు చేసిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కొన్నిసార్లు నిశ్శబ్దమే సరైన సమాధానంగా నిలుస్తుంది’ అని అందులో పేర్కొన్నాడు.

హార్దిక్ పాండ్యాకు ముంబై కెప్టెన్సీ ఇవ్వడంతో పాటు.. రోహిత్ శర్మ ఇక టీ20లకు స్వస్తి పలకనున్నాడని వస్తోన్న వార్తలు.. బుమ్రాకు అసహనానికి కారణం అని తెలుస్తోంది. తాను కెప్టెన్ అవుతానని అనుకుంటే.. హార్దిక్ దాన్ని తన్నుకుపోవడంతో.. బుమ్రా ఫ్రాంచైజీ మారే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. ట్విట్టర్‌లో ముంబై ఇండియన్స్ జట్టును కూడా అన్‌ఫాలో చేశాడు బుమ్రా. దీంతో ముంబైను వీడే ఆలోచనలో బుమ్రా ఉన్నట్టు సమాచారం. అలాగే విరాట్ కోహ్లీ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుమ్రా టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రూమర్స్‌కు ఫ్యూయల్ పోసేలా.. అతడు ఆర్సీబీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నాడు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.