IPL Prize Money: విజేతకే కాదు.. ఆ జట్లపైనా కాసుల వర్షం.. ఎవరికి ఎంత దక్కనుందంటే.. పూర్తి జాబితా ఇదే

|

May 26, 2024 | 11:43 AM

IPL Prize Money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ మ్యాచ్ మే 26న జరగనుంది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. మ్యాచ్ కోసం ఇరు జట్లూ జోరుగా సిద్ధమవుతున్నాయి. IPL 2024లో KKR వర్సెస్ SRH రెండూ అద్భుతంగా ఆడాయి. ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు టైటిల్‌తో పాటు భారీ మొత్తంలో డబ్బును కూడా అందుకుంటుంది. ఛాంపియన్ జట్టుతో పాటు, రన్నరప్‌లు, ప్లేఆఫ్‌లోని ఇతర రెండు జట్లు, ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతలపై కూడా డబ్బు వర్షం కురుస్తుంది.

IPL Prize Money: విజేతకే కాదు.. ఆ జట్లపైనా కాసుల వర్షం.. ఎవరికి ఎంత దక్కనుందంటే.. పూర్తి జాబితా ఇదే
Ipl 2024 Prize Money
Follow us on

IPL Prize Money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ మ్యాచ్ మే 26న జరగనుంది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. మ్యాచ్ కోసం ఇరు జట్లూ జోరుగా సిద్ధమవుతున్నాయి. IPL 2024లో KKR వర్సెస్ SRH రెండూ అద్భుతంగా ఆడాయి. ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు టైటిల్‌తో పాటు భారీ మొత్తంలో డబ్బును కూడా అందుకుంటుంది. ఛాంపియన్ జట్టుతో పాటు, రన్నరప్‌లు, ప్లేఆఫ్‌లోని ఇతర రెండు జట్లు, ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతలపై కూడా డబ్బు వర్షం కురుస్తుంది. IPL 2024లో లభించే ప్రైజ్ మనీ గురించి తెలుసుకుందాం..

గెలిచిన జట్టుపై కాసుల వర్షం..

ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిస్తే మూడోసారి టైటిల్ గెలిచిన జట్టుగా అవతరిస్తుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (పేరు మార్చక ముందు డెక్కన్ ఛార్జర్స్ కూడా ఓసారి గెలిచింది) టైటిల్‌ మ్యాచ్‌లో గెలిస్తే ఐపీఎల్‌లో రెండోసారి విజేతగా నిలిచిన జట్టుగా అవతరిస్తుంది. ఏ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంటే ట్రోఫీతో పాటు రూ.20 కోట్ల భారీ ప్రైజ్ మనీని అందుకుంటుంది.

విజేతతో పాటు రన్నరప్‌గా నిలిచిన జట్టుకు కూడా భారీ మొత్తం అందుతుంది. ప్రస్తుత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు లభిస్తాయి. దీంతోపాటు మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌కు రూ.7 కోట్లు బహుమతిగా లభించనుంది. నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ.6.5 కోట్లు ఇవ్వనున్నారు. ఓవరాల్‌గా ప్లే ఆఫ్‌కు చేరిన నాలుగు జట్లకు దాదాపు 6 కోట్లపైన అందుతాయి.

జట్లతో పాటు, ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్‌తో పాటు రూ.15 లక్షలు ఇవ్వనున్నారు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్‌తో పాటు రూ.15 లక్షలు కూడా అందుతాయి. ప్రస్తుతం, ఆరెంజ్ క్యాప్ రేసులో, RCB వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 714 పరుగులతో ఆధిక్యంలో ఉన్నాడు. కాగా, పర్పుల్ క్యాప్ రేసులో పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ 24 వికెట్లతో ఆధిక్యంలో ఉన్నాడు.

IPL 2024 ప్రైజ్ మనీ జాబితా..

విజేత – రూ. 20 కోట్లు

రన్నరప్ – రూ. 13 కోట్లు

మూడో స్థానంలో నిలిచిన జట్టు – రూ. 7 కోట్లు

నాలుగో స్థానంలో నిలిచిన జట్టు – రూ. 6.5 కోట్లు

ఆరెంజ్ క్యాప్ – రూ. 15 లక్షలు

పర్పుల్ క్యాప్ – రూ 15 లక్షలు

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – రూ. 15 లక్షలు

సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు – రూ. 12 లక్షలు

పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – రూ. 15 లక్షలు

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ – రూ. 12 లక్షలు

గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ – రూ. 12 లక్షలు.

మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..