IPL 2024: ‘పంత్’ పవర్.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఢిల్లీ కెప్టెన్.. 16 ఏళ్ల రికార్డు బద్దలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ 167 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి చెలరేగి ఆడాడు.

IPL 2024: పంత్ పవర్.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఢిల్లీ కెప్టెన్.. 16 ఏళ్ల రికార్డు బద్దలు
Rishabh Pant

Updated on: Apr 13, 2024 | 4:36 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ 167 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి చెలరేగి ఆడాడు. కేవలం 24 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 41 పరుగులు చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు రిషభ్ పంత్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. లక్నోపై 41 పరుగులతో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో 3 వేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో అతి తక్కువ బంతులు ఎదుర్కొని 3000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.

ఇంతకు ముందు ఈ రికార్డు యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన పఠాన్ కేవలం 2082 బంతుల్లోనే 3000 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును రిషబ్ పంత్ చెరిపేశాడు. 2016 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న పంత్ 2028 బంతులు ఎదుర్కొని 3000 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 3000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా కూడా రిషబ్ పంత్ నిలిచాడు.

ఇవి కూడా చదవండి

 

 

ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్:

డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్(కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, రికీ భుయ్, ఝే రిచర్డ్‌సన్, షాయ్ హోప్, లలిత్ యాదవ్, విక్కీ ఓస్త్వాల్, స్వస్తిక్ చికారా.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం