ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సారథ్యంలో ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది ముంబై. అయితే రాబోయే సీజన్‌లో ముంబై టీమ్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఫ్రాంచైజీ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. అయితే ఈ ప్రకటన తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టు ను వీడనున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ట్రేడ్ విండో ద్వారా హిట్‌మ్యాన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాయని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో రెండు ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోలేకపోయాయి. ఇది జరిగిన వెంటనే రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరబోతున్నాడనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ధోనీ వారసుడిగా హిట్‌మ్యాన్ సీఎస్‌కే జట్టుకు నాయకత్వం వహిస్తాడనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. తాజాగా ఈ వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మౌనం వీడారు. రోహిత్ శర్మ కోసం CSK ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు ఎలాంటి ఆఫర్ చేయలేదని స్పష్టం చేశారు. రోహిత్ శర్మ కొనుగోలు విషయంపై ఎలాంటి చర్చలు జరగలేదని, ఇవన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టి పారేశారు.
‘చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏ ఆటగాడి కోసం ఏ ఫ్రాంచైజీతోనూ చర్చలు జరపలేదు. ముంబై ఇండియన్స్‌తో ట్రేడింగ్ చేయగల ఆటగాళ్లు కూడా మాకు లేరు. రోహిత్ శర్మ సీఎస్‌కేలోకి వస్తున్నాడనేది కేవలం రూమర్ మాత్రమే’ కాశీ విశ్వనాథన్ అన్నారు. అంటే రోహిత్ శర్మను తీసుకొనేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా ఆసక్తి చూపడంలేదన్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికే ట్రేడింగ్‌కు ప్రయత్నించిన ఢిల్లీ క్యాపిటల్స్ లేదా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలు రానున్న 29 రోజుల్లో రోహిత్ శర్మను కొనుగోలు చేస్తాయా? లేదా? అన్నది చూడాలి.
ఆ వార్తలన్నీ పుకార్లే.. నమ్మద్దు..
Captain Forever 💛 @MSDhoni pic.twitter.com/M4QYbNvg3a
— Chennai Super Kings Fans (@CskIPLTeam) November 26, 2023
This was the same night when Mumbai Indians backstabed rohit Sharma and made pandya the captain
See his face and still people think he agreed to give captaincyCRYBABY MUMBAI INDIANS pic.twitter.com/L6Ua5zBmRq
— Atty (@Atty045) December 19, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..