PBKS vs RR, IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్‌.. టాస్ ఓడిన పంజాబ్.. కెప్టెన్‌ శిఖర్ ధావన్ దూరం

Punjab Kings vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో  భాగంగా 27వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్,  పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి.  ముల్లాన్ పూర్ లోని మహారాజా యదవీందర్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్  జరుగుతోంది

PBKS vs RR, IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్‌.. టాస్ ఓడిన పంజాబ్.. కెప్టెన్‌ శిఖర్ ధావన్ దూరం
Punjab Kings Vs Rajasthan R

Updated on: Apr 13, 2024 | 7:19 PM

Punjab Kings vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో  భాగంగా 27వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్,  పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి.  ముల్లాన్ పూర్ లోని మహారాజా యదవీందర్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్  జరుగుతోంది. రాజస్థాన్ జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ ప్రదర్శన కూడా బాగుంది. కానీ చివరి ఓవర్లో చేతికి వచ్చిన విజయాలను చేజార్చుకుంటోంది. దీంతో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. సంజూ శాంసన్‌ సేన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక ఓటమితో అగ్రస్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ రెండు విజయాలు, మూడు ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉంది. హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో పంజాబ్ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మైదానంలో జరిగిన గత రెండు మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠ సాగాయి. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ 11 సార్లు గెలుపొందగా, రాజస్థాన్ రాయల్స్ 15 సార్లు గెలిచింది.

 

ఇవి కూడా చదవండి

కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్‌ తీసుకున్నాడు. అంటేపంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది. కాగా నేటి మ్యాచ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ ఆడడం లేదు. కాబట్టి, జట్టును నడిపించే బాధ్యతను సామ్ కరణ్‌కు అప్పగించారు. వైస్ కెప్టెన్ గా జితేష్ శర్మ ఉండగా, శిఖర్ ధావన్‌కు బదులుగా టైడేను జట్టులోకి తీసుకున్నారు

రెండు జట్ల XI ప్లేయింగ్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

జానీ బెయిర్‌స్టో, అథర్వ థైడే, ప్రభాసిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రాహుల్ చాహర్, అశుతోష్ శర్మ, విధ్వత్ కావరప్ప, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, నాథన్ ఎల్లిస్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, తనుష్ కొటియన్, కేశవ్ మహరాజ్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, అబిద్ ముస్తాక్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..