MI vs CSK, IPL 2024: ముంబైతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. జూనియర్ మలింగ వచ్చేశాడు

Mumbai Indians vs Chennai Super Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 14) సాయంత్రం జరిగే డబుల్ హెడర్ మ్యాచ్‌లో రెండు బలమైన జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది.

MI vs CSK, IPL 2024: ముంబైతో మ్యాచ్.. టాస్ ఓడిన  చెన్నై.. జూనియర్ మలింగ వచ్చేశాడు
Mi Vs Csk, Ipl 2024

Updated on: Apr 14, 2024 | 7:18 PM

Mumbai Indians vs Chennai Super Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 14) సాయంత్రం జరిగే డబుల్ హెడర్ మ్యాచ్‌లో రెండు బలమైన జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో నిలిచిన ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో తొలిసారి తలపడనున్నాయి. అంతేకాదు ఈ రెండు జట్లు తొలిసారి తమ కొత్త కెప్టెన్లతో మైదానంలోకి రానున్నాయి. ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు CSK సారథిగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు మొత్తం 36 సార్లు తలపడ్డాయి. ఈ 36 మ్యాచ్‌ల్లో అత్యధికంగా ముంబైదే ఆధిపత్యం. ముంబయి 36 మ్యాచ్‌ల్లో 20 గెలిచింది. చెన్నై 16 మ్యాచ్‌లు గెలిచింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు జరిగాయి. స్వదేశంలో ముంబై ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 గెలిచింది. చెన్నై 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

మొదట బ్యాటింగ్ చేయనున్న చెన్నై..

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయస్ గోపాల్, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, నమన్ ధీర్, నెహాల్ వధేరా, హార్విక్ దేశాయ్

చెన్నై సూపర్ కింగ్స్

రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

మతీషా పతిరణ, నిశాంత్ సింధు, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, షేక్ రషీద్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..