
Lucknow Super Giants vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 48వ మ్యాచ్‌లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 30) లక్నో సూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఎందుకంటే ప్లేఆఫ్ రేసులో ఉన్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో ముందుకెళ్లే స్థానముంది. ముంబై ఇండియన్స్ తమ ప్లేఆఫ్ కలలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. మరోవైపు నేటి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడ్డాయి. LSG జట్టు 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఒక్కసారి మాత్రమే గెలిచింది.లక్నో సూపర్‌జెయింట్స్ ఇక్కడ బలంగా కనిపిస్తున్నప్పటికీ, ముంబై ఇండియన్స్ నుండి కూడా గట్టి పోటీని ఆశించవచ్చు. కాబట్టి ఎకానా స్టేడియంలో ఇరు జట్ల నుంచి హోరాహోరీ పోరును ఆశించవచ్చు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీని ప్రకారం ముంబై ఇండియన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
🚨 Toss Update 🚨
Lucknow Super Giants elect to bowl against Mumbai Indians.
Follow the Match ▶️ https://t.co/I8Ttppv2pO#TATAIPL | #LSGvMI pic.twitter.com/Xy0DcL6by1
— IndianPremierLeague (@IPL) April 30, 2024
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కొట్జియా, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.
నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రీవిస్, నమన్ ధీర్, షామ్స్ ములానీ
లక్నో సూపర్‌జెయింట్స్ (ప్లేయింగ్ ఎలెవన్):
కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.
అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్
𝕋𝔼𝔸𝕄 ℕ𝔼𝕎𝕊 📜
Gerald Coetzee is 🔙 in our XI as we take on the Super Giants 🔥#MumbaiMeriJaan #MumbaiIndians #LSGvMI | @Dream11 pic.twitter.com/bQEes8YBQU
— Mumbai Indians (@mipaltan) April 30, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..