IPL 2024: ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్ ఛాన్స్‌! 9 మ్యాచుల్లో ఇంకా ఎన్ని గెలవాలో తెలుసా?

|

Apr 13, 2024 | 9:14 PM

ఐపీఎల్ 17వ సీజన్  తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ముంబై ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోగలదా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తాయి. అయితే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్‌కు 9 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్ ఛాన్స్‌! 9 మ్యాచుల్లో ఇంకా ఎన్ని గెలవాలో తెలుసా?
Mumbai Indians
Follow us on

ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి విజయాల బాట పట్టింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఐపీఎల్ 17వ సీజన్  తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ముంబై ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోగలదా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తాయి. అయితే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్‌కు 9 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ముంబై ఇండియన్స్ తన ఆరో మ్యాచ్ లో పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. మరి నాకౌట్ దశకు చేరాలంటే ముంబై ఇంకా ఎన్ని మ్యాచుల్లో గెలవాలో తెలుసుకుందాం రండి. ఐపీఎల్ 2014లో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే జరిగింది. అయితే ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. 2015లో తొలుత 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కానీ ఏకంగా టైటిల్ ఎగరేసుకుపోయింది. 2015లో ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే కనీసం 8 గేమ్‌లు గెలవాలి. అంటే 16 పాయింట్లు సాధించి నెట్ రన్ రేట్ బాగుంటే ప్లేఆఫ్స్‌లో సునాయాసంగా ఆడే అవకాశం ఉంటుంది. అంటే ముంబై ఇండియన్స్ మిగిలిన 9 మ్యాచ్‌ల్లో ఇంకా 6 గెలవాల్సి ఉంది. ఏప్రిల్ 14న ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 18న పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 22న రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 27న ఢిల్లీ క్యాపిటల్స్, ఏప్రిల్ 30న లక్నో సూపర్ జెయింట్స్, మే 3న కోల్‌కతా నైట్ రైడర్స్, మే 6న సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ మే 11న రైడర్స్, మే 17న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.

ముంబై ఇండియన్స్‌ మిగిలిన 9 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు వాంఖడే స్టేడియంలో జరగనున్నాయి. ఏప్రిల్ 14, మే 3, మే 6, మే 17 తేదీల్లోని మ్యాచ్ లకు వాంఖడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఇక ఇతర మ్యాచ్‌లు ముంబై వెలుపల జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్ జట్టు:

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (WK), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్, క్వీనా మఫకా, నమన్ ధీర్, నేహాల్ వధేరా, షమ్స్ ములానీ, శ్రేయాస్ గోపాల్, ల్యూక్ వుడ్, హర్పిత్ దేశాయ్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, శివాలిక్ శర్మ, అన్షుల్ కాంబోజ్, నువాన్ తుషార, డెవాల్డ్ బ్రీవిస్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి