
Reece Topley: ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టోప్లీ గాయం కారణంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో జాతీయ జట్టుతోపాటు ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌ల ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగులుతోంది. ఫిబ్రవరి 17న ప్రారంభమయ్యే పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు రీస్ టోప్లీ ప్రస్తుతం దూరంగా ఉన్నాడు. మీడియా నివేదికల ప్రకారం, టోప్లీ PSL-9లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు కోసం ఆడాల్సి ఉంది. టాప్లీ ప్రస్తుతం గాయ పడ్డాడు. ఇటువంటి పరిస్థితిలో, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ముందు జాగ్రత్త చర్యగా, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఈ ప్లేయర్ ఆడేందుకు NOC జారీ చేయలేదు.
ఇది PSL ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్‌లకు దెబ్బ మాత్రమే కాదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఇది బ్యాడ్ న్యూస్. IPL 2024 కోసం RCB రీస్ టాప్లీని ఉంచుకుంది. ఇంతకుముందు, IPL 2023 సమయంలో కూడా, ముంబై ఇండియన్స్‌తో జరిగిన IPL 2023 ప్రారంభ మ్యాచ్‌లో టాప్లీ గాయపడ్డాడు. అతని భుజానికి గాయమైంది. ఇది అతని IPL అరంగేట్రం మాత్రమే. ఈ గాయం కారణంగా, అతను IPL 2023 నుంచి తప్పుకున్నాడు.
రీస్ టాప్లీ ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 లీగ్ SA20లో పాల్గొన్నాడు. అతను డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. అతని జట్టు ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఈస్టన్ కేప్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అతను 10 SA20 మ్యాచ్‌ల్లో మొత్తం 12 వికెట్లు తీశాడు. ఈ 29 ఏళ్ల పేసర్ ఫైనల్‌లో 32 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు.
అంతకుముందు, రీస్ టోప్లీ గత సంవత్సరం భారతదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడి, ఆ తర్వాత అతను టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..