IPL 2024: చెరో రూ. 12 లక్షలు కట్టండి.. ఆర్సీబీ, పంజాబ్ కెప్టెన్లకు బీసీసీఐ షాక్.. కారణమిదే

ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో ఆర్సీబీ ప్రయాణం లీగ్ దశలోనే ముగిసింది. ఆదివాకం KKRతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో RCB కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. దీంతో కప్‌ గెలవాలన్న ఆర్సీబీ కల మళ్లీ కలగానే మిగిలిపోయింది. లీగ్ దశలోనే నిష్క్రమించి షాక్ లో ఉన్న ఆర్సీబీకి ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది.

IPL 2024: చెరో రూ. 12 లక్షలు కట్టండి.. ఆర్సీబీ, పంజాబ్ కెప్టెన్లకు బీసీసీఐ షాక్.. కారణమిదే
Faf Du Plessis, Sam Curran

Updated on: Apr 22, 2024 | 6:10 PM

ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో ఆర్సీబీ ప్రయాణం లీగ్ దశలోనే ముగిసింది. ఆదివాకం KKRతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో RCB కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. దీంతో కప్‌ గెలవాలన్న ఆర్సీబీ కల మళ్లీ కలగానే మిగిలిపోయింది. లీగ్ దశలోనే నిష్క్రమించి షాక్ లో ఉన్న ఆర్సీబీకి ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. KKRతో జరిగిన మ్యాచ్‌లో IPL నిబంధనలను ఉల్లంఘించినందుకు RCB కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు BCCI జరిమానా విధించింది. అతనితో పాటు నిన్న జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సామ్ కరణ్ కూడా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సమయానికి ఓవర్‌లను పూర్తి చేయలేకపోయింది. అందుకే చివరి ఓవర్‌లో 30 యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం 4 ఫీల్డర్‌లకు మాత్రమే అనుమతించాల్సి వచ్చింది. మ్యాచ్ తర్వాత స్లో ఓవర్ రేట్ కారణంగా ఫాఫ్ డు ప్లెసిస్‌కి బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది.

ఇక పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించిన సామ్ కరణ్ అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.

ఇవి కూడా చదవండి

 

ఈ ఎడిషన్‌లో స్లో ఓవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు శిక్ష పడిన ఐపీఎల్ జట్ల కెప్టెన్ల సంఖ్య 8కి చేరుకుంది. ఫాఫ్ డుప్లెసిస్‌ కంటే ముందు 7 మంది భారతీయ కెప్టెన్లు ఈ పెనాల్టీని ఎదుర్కొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి