AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Points Table: లక్నో విజయంతో మారిన పాయింట్ల పట్టిక.. మీ ఫేవరేట్ టీం ఏ నంబర్‌లో ఉందో తెలుసా?

IPL Points Table: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల భారీ విజయంతో లక్నో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో వరుసగా రెండో స్థానంలో నిలిచింది.

IPL 2023 Points Table: లక్నో విజయంతో మారిన పాయింట్ల పట్టిక.. మీ ఫేవరేట్ టీం ఏ నంబర్‌లో ఉందో తెలుసా?
Ipl Points Table
Venkata Chari
|

Updated on: Apr 29, 2023 | 3:04 AM

Share

IPL 2023 Updated Points Table After PBKS vs LSG Match: ఐపీఎల్ 16వ సీజన్ 38వ లీగ్ మ్యాచ్‌లో, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS)పై 56 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో నెట్‌ రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకుంది. ఈ విజయంతో లక్నో జట్టు 8 మ్యాచ్‌లు ముగిసేసరికి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నేరుగా నంబర్ 2 స్థానానికి చేరుకుంది. లక్నో టీం నెట్ రన్‌రేట్ ఇప్పుడు 0.841గా నిలిచింది.

మొదటి స్థానంలో రాజస్థాన్‌..

38 లీగ్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి, రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లలో 5 గెలిచారు. రాజస్థాన్ టీం నెట్ రన్‌రేట్ ప్రస్తుతం 0.939గా నిలిచింది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లలో 5 గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు మూడవ స్థానంలో ఉంది. నెట్ రన్‌ రేట్ ప్రస్తుతం 0.580గా నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్‌లలో 5 గెలిచి, నెట్ రన్‌ రేట్ 0.376గా నిలిచింది.

ఆర్‌సీబీ 5వ స్థానంలో..

పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 4 గెలిచి 4 ఓడిపోయి 5వ స్థానంలో ఉంది. ఈ సమయంలో, RCB నికర రన్ రేట్ -0.139గా నిలిచింది. ఆరో స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఉంది. ఈ జట్టు 8 మ్యాచ్‌లలో 4 గెలిచి 4 ఓడిపోయింది. భారీ ఓటమి తర్వాత పంజాబ్ నెట్ రన్ రేట్ మైనస్‌లోకి చేరుకుంది. ప్రస్తుతం -0.510కి చేరుకుంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 మ్యాచ్‌ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

చివరి మూడు స్థానాల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ..

చివరి 3 స్థానాల గురించి మాట్లాడితే, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 9వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10వ స్థానంలో నిలిచింది. ఇందులో రెండు జట్లూ ప్రస్తుతం తలో 4 పాయింట్లతో ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!