ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023కి ముందు, పంజాబ్ కింగ్స్ జట్టులో పెద్ద మార్పు వచ్చింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ధావన్ అనుభవజ్ఞుడైన ఆటగాడే కాదు, ఇటీవలి కాలంలో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా కనిపిస్తున్నాడు. న్యూజిలాండ్ టూర్‌లో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టుకు ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మయాంక్ కంటే ధావన్‌కు కెప్టెన్సీ అనుభవం ఎక్కువగా ఉంది. అందుకే పంజాబ్‌కు మంచి ఎంపిక కావచ్చని తెలుస్తోంది.
గత సీజన్‌లోనే ధావన్‌ను కెప్టెన్‌గా చేయాలని పంజాబ్ ప్రయత్నాలు చేసింది. అయితే చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని మయాంక్‌ను కెప్టెన్‌గా నియమించింది. గత సీజన్‌లో మయాంక్ కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన ఆశినంతగా లేకపోవడంతో ఆ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. వచ్చే సీజన్‌లో ధావన్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ సరికొత్తగా రాణించడానికి ప్రయత్నించనుంది.
Gabbar will be at the ??????? for Punjab Kings! ?#SherSquad, welcome your ? Skipper, Jatt ji! ♥️?#ShikharDhawan #CaptainGabbar #SaddaPunjab #PunjabKings @SDhawan25 pic.twitter.com/BjEZZVVGrw
— Punjab Kings (@PunjabKingsIPL) November 2, 2022
బ్యాటింగ్‌లోనూ గత సీజన్‌లో మయాంక్ కంటే ధావన్ మెరుగ్గా రాణించాడు. ధావన్ 14 మ్యాచ్‌ల్లో 38.33 సగటుతో 460 పరుగులు చేసి పంజాబ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ధావన్ బ్యాటింగ్‌లో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు అజేయంగా 88లుగా నిలిచింది. మయాంక్ 12 ఇన్నింగ్స్‌ల్లో 16.33 సగటుతో 196 పరుగులు మాత్రమే చేశాడు. మయాంక్ బ్యాట్ నుంచి ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే నమోదైంది.