IPL 2023: రాజస్థాన్ ఖాతాలో థ్రిల్లింగ్ విక్టరీ.. జడేజా-ధోని సిక్సర్లు వృధా..!

|

Apr 13, 2023 | 12:07 AM

ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు(బుధవారం) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్యచేదనలో జడేజా-ధోని ద్వయం సిక్సర్లతో చెన్నై తరఫున చెలరేగినా చివరికి ఫలితం లేకపోయింది. అలాగే రాజస్థాన్

IPL 2023: రాజస్థాన్ ఖాతాలో థ్రిల్లింగ్ విక్టరీ.. జడేజా-ధోని సిక్సర్లు వృధా..!
Rr Beat Csk By 3 Runs
Follow us on

ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు(బుధవారం) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్యచేదనలో జడేజా-ధోని ద్వయం సిక్సర్లతో చెన్నై తరఫున చెలరేగినా చివరికి ఫలితం లేకపోయింది. అలాగే రాజస్థాన్ తరఫున సందీప్ శర్మ చాకచక్యంతో చివరి ఓవర్ బౌలింగ్ వేయడంతో రాజస్థాన్ ఖాతాలో మరో విజయం చేరింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ క్రమంలో యశస్వీ జైశ్వాల్(10) ఆదిలోనే వికెట్ కోల్పోవడంతో రాయల్స్ టీమ్‌ శుభారంభం లభించలేదు. మరోవైపు ఓపెనర్‌గా క్రీజులో ఉన్న జాస్ బట్లర్‌కి దేవ్‌దత్ పాడిక్కల్ తోడయ్యాడు. దీంతో ఈ జోడి చెలరేగి రెండో వికెట్‌కి 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

అయితే పడిక్కల్ 38 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ శామ్సన్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన అశ్విన్ 30 పరుగులు చేసి వెనుదిగిగాడు. ఆ వెంటనే బట్లర్ కూడా 52 పరుగుల వద్ద క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చినవారిలో హెట్‌మేయర్ అజేయంగా 30 పరుగుల చేసి జట్టు స్కోరుని 175 పరుగులకు చేర్చాడు. ఈ క్రమంలో చెన్నై తరఫున అకాశ్ సింగ్, దేశ్‌పాండే, జడేజా తలో 2 వికెట్లు తీయగా..మొయిన్ ఆలీ 1 వికెట్ తీసుకున్నాడు. ఆపై 176 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం లభించలేదు. రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులకే వెనుదిరిగాడు. ఇక అనంతరం వచ్చిన అజింక్యా రహానే కూడా 32 పరుగులతో డగౌట్‌కి చేరాడు.

ఇవి కూడా చదవండి

ఇంకా అనంతరం వచ్చిన శివమ్ దుబే(8), మొయిన్ అలీ(7), అంబటి రాయుడు(1) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. అ క్రమంలోనే డెవాన్ కాన్వే కూడా హాఫ్ సెంచరీ చేసి  50 పరుగుల వద్దనే వికెట్ కోల్పోయాడు. ఇక అబంటి రాయుడు తర్వాత జడేజా, కాన్వే తర్వాత ధోని క్రీజులోకి రావడంతో కొంతసమయం సిక్సర్ల వర్షం కురిసింది. అయితే ఆ బంతుల్లో 20 పరుగులు చేయాలన్న సమయంలో.. చివరి ఓవర్‌ మొదట్లోనే వైడ్ రూపంలో రెండు పరుగులు అదనంగా వచ్చాయి. ఆపై మొదటి వంతిని డాట్ ఆడిన ధోని తర్వాత రెండు సిక్సర్లు కొట్టాడు. ఇక మిగిలిన 3 బంతులలో 3 సింగిల్స్  రావడంతో చెన్నై 3 పరుగుల తేడాతోనే ఓటమిపాలైంది. ఈ క్రమంలో రాజస్థాన్ తరఫున రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు.. ఆడమ్ జంపా, సందీప్ శర్మ చెరొ వికెట్ తీసుకున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..