103/8.. ముంబై విధించిన 219 పరుగుల లక్ష్య ఛేదనలో 13 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోరు ఇది. దీంతో గుజరాత్‌కు ఘోర పరాభవం తప్పదనుఉన్నారు చాలామంది . అయితే ఆఫ్గాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ పరిస్థితిని మొత్తం తారుమారు చేశాడు. రన్స్ తీయడం వేస్ట్ అనుకున్నాడేమో కేవలం సిక్సర్లు, ఫోర్లతోనే పరుగులు సాధించాడు. ఓ స్పెషలిస్ట్ బ్యాటర్‌లా ముంబై బౌలర్లను చితక బాదిన రషీద్ కేవలం 32 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండడం విశేషం. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ రషీద్ ధనాధాన్ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. తద్వారా కేవలం 27 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రషీద్ తర్వాత డేవిడ్ మిల్లర్(41) మాత్రమే రాణించాడు. మిగతా బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. మ్యాచ్ ఓడిపోయినా రషీద్ తన సునామీ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజా అందించాడు. ముంబయి బౌలర్లలో మధ్వాల్ 3, చావ్లా 2, కార్తికేయ 2, బెహ్రాన్‌డార్ఫ్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంలో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది రోహిత్ సేన. ఎప్పటిలాగే గుజరాత్ అగ్రస్థానంలో ఉంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(103) మరోసారి సెంచరీతో చెలరేగాడు. ఇషాన్ కిషన్ (31), విష్ణు వినోద్ (30), రోహిత్ శర్మ (29) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు తీశాడు.
“Main expert hoon, mujhe sab aata hai” ?
Maiden IPL 5️⃣0️⃣ for @rashidkhan_19 ??#MIvGT #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/Yto3zZ52bC
— JioCinema (@JioCinema) May 12, 2023
Stumps splattered ? Madhwal gets the big fish!#MIvGT #IPLonJioCinema | @mipaltan pic.twitter.com/biW7CIbdpg
— JioCinema (@JioCinema) May 12, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..