IPL Auction 2023: ఐపీఎల్ మినీ వేలానికి మరో 4 రోజులే.. లైవ్ స్ట్రీమింగ్ నుంచి ప్లేయర్ల జాబితా వరకు.. పూర్తి వివరాలు..
IPL 2022: IPL 2023 మినీ వేలానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది.
IPL 2023 Auction: ఐపీఎల్ 2023 మినీ వేలానికి 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం డిసెంబర్ 23న, మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలో నిర్వహించనున్నారు. IPL 2023 వేలం ప్రత్యక్ష ప్రసారాన్ని JioCinema, స్టార్ స్పోర్ట్స్‌లో చూడవచ్చు. అలాగే TV9 తెలుగులోనూ లైవ్ అప్‌డేట్స్ పొందవచ్చు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మంగళవారం వేలం పూల్‌ను ప్రకటించింది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 991 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే తుది జాబితాలో 405 మంది ఆటగాళ్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఈ 405 మంది ఆటగాళ్లలో 273 మంది భారతీయులు కాగా, 132 మంది విదేశీయులు ఉన్నారు. నలుగురు ఆటగాళ్లు అసోసియేట్స్ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈ జాబితాలో 119 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 282 మంది ఆటగాళ్లు అన్‌క్యాప్‌లో ఉన్నారు. IPL 2023 కోసం 87 స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం ఈ ఆటగాళ్లను వేలం వేయనున్నారు. ఈ 405 మంది క్రికెటర్లలో కొంతమంది స్టార్ ఆటగాళ్ల బేస్ ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బేస్ ధర రూ. 2 కోట్లలో ఉన్న ప్లేయర్లు వీరే..
IPL 2023 వేలంలో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరి బేస్ ధర రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఈ జాబితాలో రిలే రోసౌ, కేన్ విలియమ్సన్, సామ్ కర్రాన్, కామెరాన్ గ్రీన్, జాసన్ హోల్డర్, బెన్ స్టోక్స్, టామ్ బాంటన్, నికోలస్ పూరన్, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, ఆదిల్ రషీద్, ట్రావిస్ హెడ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, జిమ్మీ నీషమ్, క్రిస్టన్ మరియు, టైమల్ మిల్స్ వంటి ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు.
రూ. 1.50 కోట్ల బేస్ ప్రైస్‌లో ఉన్న ప్లేయర్లు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం, ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది ఆటగాళ్లు తమ బేస్ ధర రూ. 1.50 కోట్లుగా ఉంచుకున్నారు. హ్యారీ బ్రూక్, షకీబ్ అల్ హసన్, ఝై రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, విల్ జాక్వెస్, డేవిడ్ మలన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రిలే మెరెడిత్, జాసన్ రాయ్, సీన్ అబాట్, నాథన్ కౌల్టర్-నైల్ ఈ జాబితాలో ఉన్నారు.
రూ. 1 కోటి బేస్ ప్రైస్‌లో ఉన్న ప్లేయర్లు..
కోటి రూపాయల బేస్ ధర ఉన్న లిస్టులో డజన్ల కొద్దీ క్రికెటర్లు ఉన్నారు. మయాంక్ అగర్వాల్, జో రూట్, హెన్రీ క్లాసెన్, అకిల్ హొస్సేన్, ముజీబ్ రెహమాన్, తబ్రైజ్ షమ్సీ, మనీష్ పాండే, డారిల్ మిచెల్, మహ్మద్ నబీ, షాయ్ హోప్, టామ్ లాథమ్, మైఖేల్ బ్రాస్‌వెల్, ఆండ్రూ టై, ల్యూక్ వుడ్, డేవిడ్ వైస్, మోయిసెస్ హెన్రీన్, మోయిసెస్ హెన్రీన్ రోస్టన్ చేజ్, రహ్కీమ్ కార్న్‌వాల్ వంటి క్రికెటర్లు ఇందులో ఉన్నారు.
IPL 2023 వేలం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
IPL 2023 వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరుగుతుంది.
IPL 2023 వేలం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
IPL 2023 వేలం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.
IPL 2023 వేలానికి వేదిక?
ఐపీఎల్ 2023 వేలం డిసెంబర్ 23న భారతదేశంలోని కొచ్చిలో జరగనుంది.
IPL 2023 వేలాన్ని ఎక్కడ చూడొచ్చు?
IPL 2023 వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది.
IPL 2023 వేలం ప్రత్యక్ష ప్రసారాన్ని ఎలా చూడొచ్చు?
IPL 2023 వేలం ప్రత్యక్ష ప్రసారం JioCinemaలో చూడొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..