
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ 5వ మ్యాచ్ ప్రస్తుతం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతోంది . ఈ మ్యాచ్ 8వ ఓవర్ సమయంలో, RCB జట్టు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. ఆయన ఎడమ భుజానికి గాయమైంది. ఆ తర్వాత జట్టు ఫిజియోతో మాట్లాడిన తర్వాత మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.
ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత, ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేస్తుండగా, తిలక్ వర్మ RCB జట్టు స్పిన్ బౌలర్ కర్ణ్ శర్మ వేసిన బంతిని ఫైన్ లెగ్ వైపు ఫ్లిక్ చేశాడు. దానిని ఆపడానికి టోప్లీ డైవ్ చేశాడు. ఈ సమయంలో అతని కుడి భుజానికి గాయమైంది.
Reece Topley off the field due to shoulder discomfort. pic.twitter.com/w9Mzz87WHa
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2023
ఈ సమయంలో రీస్ టోప్లీ నొప్పితో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. కొంత సమయం తర్వాత RCB జట్టు ఫిజియో అతనితో మాట్లాడి, మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రీస్ టాప్లీ 2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి కేమరూన్ గ్రీన్ రూపంలో భారీ వికెట్ కూడా తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..