IPL 2022- గుజరాత్ టైటాన్స్: గత సీజన్‌లో, గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి మొదటిసారి IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 130 పరుగులు మాత్రమే చేసింది. ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఐపీఎల్ ద్వారా హార్దిక్ పాండ్య తొలి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.