ముంబై ఇండియన్స్ యంగ్ బ్యాటర్.. తెలుగు తేజం నంబూరి తిలక్ వర్మ మరోసారి దుమ్ము రేపాడు. మంగళవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తన కిర్రాక్ ఇన్నింగ్స్‌తో దడదడలాడించాడు. కేవలం 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో 4 భారీ సిక్సర్లు, రెండు ఫోర్లు ఉండడం విశేషం. కాగా తిలక్ వర్మ హైదరాబాద్ కుర్రాడే. అందుకే మంగళవార మ్యాచ్‌లో అతను ముంబై ఇండియన్స్‌తో బరిలోకి దిగినప్పటికీ హోంగ్రౌండ్‌లో ఫుల్ సపోర్ట్ లభించింది. తిలక్ సిక్సర్లు, బౌండరీలు కొట్టినప్పుడల్లా చాలామంది ఎస్‌ఆర్‌హెచ్ జెండాలతోనే కేరింతలు కొట్టడం ఆసక్తి రేపింది. తిలక్ సునామీ ఇన్నింగ్స్ కారణంగానే 20 ఓవర్లలో 192 పరుగుల భారీస్కోరు చేసింది ముంబై. తిలక్‌తో పాటు గ్రీన్ (64), ఇషాన్ కిషన్ (38), రోహిత్ (28) రాణించారు. అనంతరం భారీ స్కోరును చేధించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. దీంతో 14 పరుగుల తేడాతో సొంత మైదానంలో పరాజయం పాలైంది హైదరాబాద్.
కాగా ఈసీజన్‌లో నిలకడగా రాణిస్తూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు తిలక్. ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడిన అతను బెంగళూర్ టీమ్ పై (84నాటౌట్), సీఎస్కేపై(22), ఢిల్లీపై(41), కేకేఆర్ పై(30) పరుగులు చేశాడు. తద్వారా ప్రస్తుతం 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా తిలక్ వర్మ ఉన్నాడు. కాగా ఐపీఎల్ మినీ వేలంలో తిలక్ వర్మను దక్కించుకుందానికి సన్ రైజర్స్ చాలావరకు ప్రయత్నించింది. అయితే ఏమైందో తెలియదు కానీ ముంబై ఇండియన్స్ ఈ తెలుగు కుర్రాడిని సొంతం చేసుకుంది. అదెంత తప్పిదమో ఇప్పుడు స్వయంగా తెలుసొచ్చింది సన్‌రైజర్స్ ఓనర్ కావ్యాపాపకు. తమ జట్టు ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ను వీక్షిస్తోన్న ఆమె ముంబైతో ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందింది.
Kirak innings by our Hyderabadi potta! ?#OneFamily #SRHvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @TilakV9 pic.twitter.com/FUS3eX0KNY
— Mumbai Indians (@mipaltan) April 18, 2023
3⃣7⃣(17) @ 2⃣1⃣7⃣ – Tilak ? आहे#OneFamily #SRHvMI #MumbaiMeriJaan #IPL2023 #TATAIPL @TilakV9 pic.twitter.com/r87nfzVpLQ
— Mumbai Indians (@mipaltan) April 18, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..