Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో రన్‌మెషిన్‌గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు అవలీలగా వేలాది పరుగులు సాధించిన ఈ స్టార్ క్రికెటర్ ఇప్పుడు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాతైనా ఫామ్‌లోకి వస్తాడంటే అది కూడా జరగడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL 2022) టోర్నీలోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తున్నాడు ఈ టాప్ క్లాస్ క్రికెటర్. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన విరాట్ (Virat Kohli) కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తన ఆఫ్‌స్టంప్ బలహీనతను మరోసారి బయటపెడుతూ దుశ్మంతచమీర బౌలింగ్‌లో దీపక్ హుడాకు సింపుల్ క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు.
అదృష్టానికి ఆమడ దూరంలో..
కాగా ఈ టోర్నీలో కోహ్లీని దురదృష్టం కూడా నీడలా వెంటాడుతోంది. అనవసర పరుగుకు పత్నించి ఇప్పటికే రెండుసార్లు రనౌట్ కావడం.. మరోసారి థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి విరాట్ బలయ్యాడు. ఈక్రమంలో కోహ్లీకి అదృష్టం ఆమడదూరంలో ఉందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. మొత్తం నాలుగు ఫొటోలు ఈ పోస్టులో ఉన్నాయి. మొదటి ఫొటోలో నిద్రపోదామంటే కళ్లపై వెళుతురు పడడం.. రెండో ఫోటోలో ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేద్దామంటే మెషిన్‌లో ఇరుక్కుని చిరిగిన నోటు బయటికి రావడం.. ఇక మూడో ఫొటోలో.. రుచికరమైన కేక్ ముందున్నా తినలేని పరిస్థితి.. ఇక నాలుగో ఫొటో.. కోక్ తాగుదామంటే దానిని ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాకపోవడం’ వంటివి ఉన్నాయి. ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ లక్ ఇలా ఉందంటూ జాఫర్ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు విరాట్ త్వరగానే ఫామ్‌లోకి రావాలని కోరుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Virat Kohli’s luck these days: #LSGvRCB #IPL2022 pic.twitter.com/DZWKoP5u8n
— Wasim Jaffer (@WasimJaffer14) April 19, 2022
Also Read:Steinway Tower: ప్రపంచంలో ఎత్తైన సన్నగా ఉండే బిల్డింగ్ ఇదే.. గాలి బలంగా వీస్తే ఎలా ఉంటుందంటే..!
Biliti Electric: తెలంగాణలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఫ్యాక్టరీ.. ప్రపంచంలోనే అతిపెద్దది..!
PM Modi: భారత సాంప్రదాయ వైద్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు.. WHO చీఫ్ టెడ్రోస్‌తో కలిసి మోదీ టూర్..