IPL 2022: ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అదరగొడుతోంది. టోర్నీ ఆరంభంలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న ఆ జట్టు ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో నిలిచింది. కాగా ఆరెంజ్ ఆర్మీ తరఫున ఆడుతున్న స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వేసే అతని బంతులకు ప్రత్యర్థి బ్యాటర్ల దగ్గర సమాధానం దొరకడం లేదు. ముఖ్యంగా ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన పేస్ పదునేంటో మరోసారి రుచి చూపించాడు ఈ కశ్మీరీ స్పీడ్ గన్. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం కూడా దక్కించుకున్నాడు. కాగా పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో బంతిని తీసుకున్న ఉమ్రాన్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే చివరి ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన నాలుగో బౌలర్‌గా అవతరించాడు. ఈనేపథ్యంలో ఈ స్పీడ్‌గన్ బౌలింగ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రముఖ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) ఉమ్రాన్‌ను వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) కూడా ఈ సన్‌రైజర్స్ స్పీడ్‌స్టర్ బౌలింగ్‌కు ముగ్ధులయ్యారు. సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసలు కురిపించారు.
రాజకీయ వ్యవహారాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రికెట్‌ను కూడా తప్పక ఫాలో అవుతుంటారు కేటీఆర్. గతంలోనూ చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఆటగాళ్ల గురించి పోస్టులు పెట్టారు. ఇందులో భాగంగానే తాజాగా ఉమ్రాన్ బౌలింగ్‌పై ఆసక్తికర ట్వీట్ పెట్టారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఉమ్రాన్ ఆఖరి ఓవర్ గణాంకాలకు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన కేటీఆర్.. ‘రా పేస్‌తో నిండిన నమ్మశక్యం కాని స్పెల్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఓవర్.. టేక్ ఏ బౌ యంగ్ మ్యాన్’ అని ప్రశంసలు కురిపించారు. కాగా జమ్మూకు చెందిన ఉమ్రాన్ ఐపీఎల్-2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేశాడు. కేవలం మూడు మ్యాచ్‌లే ఆడినప్పటికీ గంటకి 151.03 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి టాప్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అందుకే ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందే రూ. 4 కోట్లు పెట్టి మళ్లీ రిటైన్ చేసుకుంది ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం .
What an unbelievable spell full of raw pace #UmranMalik ??
Take a bow young man ? By far probably the best ever over in IPL pic.twitter.com/nxZdBQyOVv
— KTR (@KTRTRS) April 17, 2022
Also Read:RR vs KKR, IPL 2022: చాహల్ ‘పాంచ్’ పటాకా.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ గెలుపు..